Suryaa.co.in

National

ఉచిత హైస్పీడ్‌ వైఫై సేవలను విస్తరించిన దక్షిణ మధ్య రైల్వే

– అన్ని స్టేషన్లలో (హాల్ట్‌ స్టేషన్లు మినహా) హైస్పీడ్‌ వైఫై వసతి ఏర్పాటు
– నవంబర్‌ నెలలో 13,950 జిబి డేటాను వినియోగించుకున్న రైలు ప్రయాణికులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు సకల సౌకర్యాలను కల్పించడంలో ప్రత్యేకించి డిజిటల్‌ ఇండియా మరియు సమాచార సాంకేతికత కలలను నెరవేరస్తూ డిజిటల్‌ కార్యక్రమాలను అమలుపరచడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలలో భాగంగా, అన్ని రైల్వే స్టేషన్లలో రైలు వినియోగదారుల కోసం హై స్పీడ్‌ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఈ దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన జోన్‌ పరిధిలో హాల్ట్‌ స్టేషన్లను మినహాయించి అన్ని రైల్వే స్టేషన్లలో భారీ సంఖ్యలో 588 రైల్వే స్టేషన్లలో హై స్పీడ్‌ వైఫై సౌకర్యాన్ని విస్తరించింది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో సుమారు 6000 రూట్‌ కిమీలు మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఒఎఫ్‌సి)తో విస్తరించి ఉంది. భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లు డిజిటల్‌ హబ్‌గా మారుతున్నాయి.

588 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించబడిరది. వీటిలో 30 మేజర్‌ నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌ స్టేషన్లు (ఎన్‌ఎస్‌జి1, ఎన్‌ఎస్‌జి2 Ê ఎన్‌ఎస్‌జి3 కేటగిరి) మరియు 558 మధ్యతరహా మరియు చిన్న స్టేషన్లు (నాన్‌ సబర్బన్‌ మరియు సబర్బన్‌ స్టేషన్లు) ఉన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని స్టేషన్లలో (హాల్ట్‌ కేటగిరి స్టేషన్లు మినహా) హై స్పీడ్‌ వైఫై వసతి విస్తరించబడినట్టు అయ్యింది.

రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రజలు హై డెఫినేషన్‌ (హెడ్‌డి) వీడియోల స్ట్రీమింగ్‌కు, సినిమాలు, గేమ్స్‌ డౌన్‌లోడిరగ్‌కు మరియు ఆన్‌లైన్‌లో వారి కార్యాలయాల విధులు నిర్వహించుకునే అవకాశాలున్నాయి. పరిమితంగా సౌకర్యాలుండే గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి అవసరాల కోసం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వైఫై వసతిని వినియోగించుకోవచ్చు.. ప్రయాణికులు వినోద కార్యక్రమాల కోసం వ్యక్తిగత డివైసెస్‌పై దీన్ని వినియోగించుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్‌, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్‌ మొదలగు స్టేషన్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ సౌకర్యంతో నెట్‌వర్క్‌ అనుసంధానం ఉత్తమంగా ఉందని, నెట్‌వర్క్‌ నిరాటంకంగా అత్యుత్తమంగా అందుబాటులో ఉంటుందని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైలు వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండేలా ఉచిత వైఫై సర్వీసు తేబడిరది. స్మార్ట్‌ ఫోన్‌ కలిగున్న వారు మెబైల్‌ కనెక్షన్‌తో దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగదారులు ప్రతిరోజు మొదటి 30 నిమిషాలు 1 ఎమ్‌బిపీఎస్‌ వరకు ఉచిత వైఫై సౌకర్యం పొందవచ్చు. తర్వాత, ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా నామమాత్రపు చార్జీలను చెల్లించి ఈ సేవలను కొనసాగించుకోవచ్చు.

డిజిటల్‌ టెక్నాలజీ ప్రయాజనాలను సామన్య భారతీయ రైలు ప్రయాణికులకు అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే మరియు రైల్‌ టెల్‌ వారిచే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టబడిరది. డిజిటల్‌ ఇండియా
wifyకలలను సాకారం చేస్తూ భారతీయ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల వినియోగ సౌకర్యార్థం రైల్‌ వైర్స్‌ వైఫై ద్వారా ఈ సాంకేతికతను అందరికీ చేరవేస్తుంది.

ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి కృషి చేసిన సిగ్నల్‌ Ê టెలికమ్యునికేషన్‌ విభాగం అధికారులను, రైల్‌ టెల్‌ అధికారులను, మరియు ఇతర సిబ్బంది అందరినీ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో స్మార్ట్‌ ఫోన్లు మరియు ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా విప్లవాత్మక సాంకేతిక మార్పులతో స్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై సౌకర్యంతో వినోదం, సమాచారం, విజ్ఞానం, నైపుణ్యం వంటి రంగాలలో ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైల్వే వారిచే ప్రవేశపెడుతున్న డిజిటల్‌ కార్యక్రమాలు రైలు వినియోగదారులందరికీ సౌకర్యవంతంగా మరియు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE