Suryaa.co.in

Telangana

కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్

-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్.ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు.

ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు గురి చేస్తోంది. బీజేపీ తిరుగులేని శక్తిగా తయారవుతున్న నేపథ్యంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి.

రైతులకు, బీజేపీకి మధ్య తగువు పెట్టాలని కేసీఆర్ ఆడిన అబద్దాలను ప్రజలెవరూ నమ్మడం లేదు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకుని తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.తక్షణమే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేంత వరకు బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

LEAVE A RESPONSE