Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే ఎస్పీ టిడిపి కేడర్ ను వేధిస్తున్నారు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
– చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపికి వర్ల రామయ్య లేఖ

ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, కస్టోడియల్ టార్చర్ రిషాంత్ అలవాటుగా మార్చుకున్నారు.ట్రాక్ రికార్డును పరిశీలిస్తే సర్వీసు ప్రారంభం నుంచి ఆయన వైఖరి వివాదాస్పదంగానే ఉంది. నర్సీపట్నంలో పనిచేసేటపుడు యేలేటి సంతోష్ అనే టిడిపి కార్యకర్తకు పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశారు.

ఆయన టార్చర్ భరించలేక యేలేటి సంతోష్ పోలీస్ స్టేషన్ భవనంపైనుంచి దూకేశాడు.సంతోష్ తల్లి ఎన్ హెచ్ ఆర్సీని ఆశ్రయిస్తే 2లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆదేశించింది.సంతోష్ కు పరిహారం ఇవ్వాలన్న ఎన్ హెచ్ఆర్సీ ఉత్తర్వులను సైతం ఎస్పీ పెడచెవిన పెట్టారు.

పోలీసులు న్యాయం చేయలేదని సంతోష్ కోర్టుకెళ్లగా, న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో చీఫ్ సెక్రటరీ డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. దీంతో భయపడి నిన్న హడావిడిగా బాధితుడికి పరిహారం ఇస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులిచ్చింది.

టిడిపి కేడర్ ను అణచివేతే అజెండాగా ఎస్పీ రిషాంత్ రెడ్డి చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారు.మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే ఎస్పీ టిడిపి కేడర్ ను వేధిస్తున్నారు.కుప్పం నియోజకవర్గంలో టిడిపి కేడర్ పై తప్పుడు కేసులుపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఆదినుంచి పోలీసు శాఖలో వివాదాస్పదుడిగా మారిన రిషాంత్ రెడ్డి ఎస్పీ పదవికి తగడని లేఖలో పేర్కొన్న వర్ల.రిషాంత్ రెడ్డిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరునుంచి బదిలీ చేసి అప్రధాన పోస్టులో నియమించాలని డీజీపీకి విజ్జప్తి. రిశాంత్ రెడ్డితో సహా తప్పుడు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వండి.

LEAVE A RESPONSE