గోవా: గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు, గోవాలోని హోటల్ తాజ్ లో పూసపాటి అశోక్ గజపతిరాజు తో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అల్పాహారం చేశారు.