Home » స్పీకర్‌గారూ.. మా పార్టీకి పాత ఆఫీసు ఇవ్వండి

స్పీకర్‌గారూ.. మా పార్టీకి పాత ఆఫీసు ఇవ్వండి

-పార్ల‌మెంట్ లో పార్టీ కార్యాల‌యం మార్పు కోసం స్పీక‌ర్ ను క‌లిసిన టిడిపి ఎంపీలు

ఢిల్లీ : పార్ల‌మెంట్ లో గురువారం టిడిపి ఎంపిలంద‌రూ క‌లిసి లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న్ లో ఫ‌స్ట్ ఫ్లోర్ లో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాల‌యం చిన్న‌దిగా వుండ‌టంతో , కొంచెం విశాల‌మైన స్థ‌లం వున్న గ‌దులు కార్యాల‌యానికి కేటాయింపు చేయాల్సిందిగా కోరారు.

టిడిపి పార్ల‌మెంట్ ప‌క్ష నేత లావు కృష్ణ‌దేవ‌రాయ ఆధ్వ‌ర్యంలో టిడిపి ఎంపీలంద‌రూ క‌లిసి వెళ్లి స్పీక‌ర్ ఓం బిర్లా వారి విజ్ఞ‌ప్తి విన్న‌వించుకున్నారు. పాత పార్లమెంట్ లో గ‌తంలో టిటిపి కి కేటాయించిన కార్యాల‌యాన్నే కొన‌సాగించాల్సిందిగా కూడా అభ్య‌ర్ధించారు.

స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసిన వారిలో కేంద్ర‌మంత్రి పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్, ఏలూరు ఎంపి పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్, నంద్యాల ఎంపి ఎంపి బైరెడ్డి శ‌బ‌రి,, విజ‌య‌న‌గ‌రం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, అమ‌లాపురం ఎంపి జీ.ఎం. హరీష్ బాలయోగి వున్నారు.

Leave a Reply