అమరావతి : అమరావతి లోని అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శాసనసభ అనుబంధ భవనాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. 3.57 కోట్లతో భవనాన్ని విప్ ల కోసం 16 క్యాబిన్లతో, మీడియా రూమ్, వెయిటింగ్ హాల్, కిచెన్, డైనింగ్, వాష్ రూమ్, సర్వర్ రూమ్ తోపాటు సౌకర్యాలు కల్పించారు.
నూతనంగా ప్రారంభించిన శాసనసభ అనుబంధ భవనంలో చీఫ్ విప్ కి కేటాయించిన ఛాంబర్ లో సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రిలు నారాయణ, పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసన సభ్యుడు జీవీ ఆంజనేయులు ఆశీనులయ్యారు.