– రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న స్పీకర్
– మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేపై తీర్పు ఇవ్వలేదేం?
– బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవహేళన చేయడం సరికాదని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అన్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నెలల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశిస్తే, మార్చి 18 న ముగ్గురు ఎమ్మెల్యే లు BRS పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారన్నారు. దాదాపు సంవత్సరంపై తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారన్నారు.
సుప్రీంకోర్టు ఎల్లుండి వరకు తీర్పు ఇవ్వాలని హెచ్చరించడంతో నేడు ముగ్గురి ఎమ్మెల్యే లకు ఒక ఎమ్మెల్యే పై క్లీన్ చిట్ ఇచ్చారు, మరి మిగతా రెండు ఎమ్మెల్యే లకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టారో సమాధానమివ్వాలన్నారు. కేవలం ఎమ్మెల్యే వెంకట్రావు ది మాత్రమే ఎటువంటి ఆధారాలు లేవని క్లిన్ చిట్ ఇచ్చారు. మరి ఎమ్మెల్యే లు దానం నాగేందర్, కడియం శ్రీహరి ల పార్టీ ఫిరాయింపులపై ఎటువంటి తీర్పు వెలువరించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
7 గురు ఎమ్మెల్యే లు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణ మోహన్, గాంధీ, ప్రకాష్ గౌడ్ లకు క్లిన్ చిట్ ఇచ్చి మిగిలిన యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ ల పై తీర్పు కూడా పెండింగ్ లో పెట్టారు. మూడు నెలల్లో ప్రకటించాల్సిన తీర్పు దాదాపు ఒక సంవత్సరం 9నెలలు గడుస్తున్నా కాలయాపన చేసి కేవలం ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రమే తీర్పు వెల్లడించి, మిగతా వారివి పెండింగ్ లో పెట్టడం వెనక కారణమేంటో చెప్పాలన్నారు.
ఇది, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి స్పీకర్ పనిచేస్తున్నట్లు ఉన్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ఎందుకని ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.