• కార్పొరేషన్ ద్వారా తీసుకున్న కార్ల రుణ మాఫీ కోసం అభ్యర్థన
• భూ కజ్జాలపై వాపోయిన బాధితులు
• సాయం కోసం గ్రీవెన్స్ లో నేతలకు అనేకమంది వినతులు
మంగళగిరి : గ్రామాల్లో పంటలు పండించుకున్నా సరైన గిట్టుబాటు ధరలేక… ధరలు వచ్చే వరకు పండిన పంటలను దాచుకోవడానికి గోడౌన్లు లేక రౌతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ.. అగ్రికల్చర్ విశ్రాంత డీడీ మైలవరపు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో ప్రత్యేక ఎకనామిక్ గ్రోత్ కాంప్లేక్స్ లను ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటును ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. రూరల్ ఎకనామిక్ గ్రోత్ పై తాను రూపొందించిన ప్లాన్ కాపీని గ్రీవెన్స్ లో టీడీపీ నేతలకు అందించారు.
మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మల్యాద్రి అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.
• చిత్తూరు జిల్లా పుంగనూరు సుగాలిమెట్ట గ్రామంలో బి రాజశేఖర్ నాయక్ కు సంబంధించిన భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు స్థానిక జడ్పిటిసి రాజు నాయక్, అతని సోదరుడు మునిస్వామి నాయక్ లు అక్రమంగా వారి పేరు పైకి మార్చుకున్నారని. దీనిపై అప్పటి తహశీల్దార్ మాధవరాజును అడిగితే తమను బెదిరించి రికార్డులు తారుమారు చేశారని వారిపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని కోరారు.
• సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సింగిరివాండ్లపల్లిలో తమ భూమితోపాటు చినీ చెట్లు ను అడపాల సురేంద్ర, శ్రీనివాస్ తదితరులు ఆక్రమించుకుని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోని తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని పసుపులేటి మంగమ్మ ఫిర్యాదు చేశారు.
• 2015-19 లో ఎన్ఎస్ఎఫ్ డిసి, ఎన్ఎస్ కేఎఫ్టిసి పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ నుండి జీవనోపాధి కొరకు కార్లు లోనుగా తీసుకుని జీవనం గడుపుతుండగా కరోనా సమయంలో బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని… అయినా వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు కట్టాలని ఇబ్బంది పెట్టారని… తాము రుణం చెల్లించలేక… నేటికి కూడా కుటుంబాలను పూర్తి స్తాయిలో పోషించుకోలేని దుర్భర పరిస్థితులలో జీవిస్తున్నామని ఎన్ఎస్ఎఫ్ డిసి, ఎన్ఎస్ కేఎఫ్టిసి రుణ గ్రహితలు వాపోయారు.. తమ యందు దయ ఉంచి రుణమాఫీ లేదా సబ్జీడీ మరింత పెంచుటకు తగు చర్యలు తీసుకొని సహకరించాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• నరసరావుపేటకు చెందిన శ్రీ కొల్లిపర లక్ష్మి కావ్య తెనాలిలోని కేఎస్ఎన్ ఫార్మా కాలేజ్ లో చదువుతుందని… ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తున్నా… ప్రభుత్వం నుండి ఫీజు రాకముందే పూర్తి ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తనను ఇబ్బంది పెడుతుందని… అంత ఫీజు ఒకే సారి కట్టలేమని… తమకు సాయం చేయాలని వారు గ్రీవెన్స్ లో టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.
• రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోయాయాని … ఒకరి పేరుమీద ఉన్న భూమిని అతనికి తెలియకుండానే మరోకరి పేరుమీదకు మార్చేస్తున్నారని.. ఇలాంటి అక్రమాలను అరికట్టాలని శాఖమూరి నారాయణరావు గ్రీవెన్స్ లో ఫర్యాదు చేశారు.
• ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన సర్వేసు విజ్ఞప్తి చేస్తూ… తన భూమి ఆక్రమణకు గురైందని… తన భూమిని ఆక్రమణ దారుల నుండి విడిపించాలని టీడీపీ నేతలకు అర్జీని అందించారు.
• పల్నాడు జిల్లా రెంట చింతల మండలం డేగల సైదరాజు వాపోతూ.. మాచర్లలో ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ఎస్సీ కార్పొరేషన్ షాపు గత టీడీపీ ప్రభుత్వం తనకు కేటాయించిందని… టీడీపీ ఏజెంటుగా 2019 ఎన్నికల్లో కూర్చోవడంతో ఎస్సీ కార్పొరేషన్ షాపు ఇవ్వలేదని… దయ ఉంచి తనకు షాపు కేటాయించాలని అతను వేడుకున్నాడు.
• తాను టీడీపీ పార్టీకి చెందిన వాడు కావడంతో తనకు రావాల్సిన బిల్లలును గత ప్రభుత్వంలో ఆపేశారని శాఖమూరి ప్రసాద్ బాబు వాపోయాడు… దేవాలయాల్లో తాను చేసిన కాంట్రాక్టు పనులకు బిల్లులు ఇప్పించవలసిందిగా గ్రీవెన్స్ లో ఆయన అభ్యర్థించాడు.
• చిలకలూరి పేట గవర్నమెంట్ ఆసుపత్రిలో ANM గా పనిచేస్తున్న తనకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని లక్కా ఉషారాణ వినతుల స్వీకరణ కార్యక్రమంలో వాపోయారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో ఇల్లుగడవడానికి ఇబ్బందిగా ఉందని వెంటనే తమ జితాలు ఇప్పించాలని ఆమెతో పాటు మరికొంత మంది ఏఎన్ఎమ్ లు వాపోయారు.
• వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మీసేవా కేంద్రాలను నిర్వహించే 50 వేల కుంటుంబాలు రోడ్డున పడ్డాయని.. కూటమి ప్రభుత్వమే మీ సేవా నిర్వాహకులను ఆదుకోవాలని రాష్ట్ర మీ సేవా నిర్వహకులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా వైసీపీ ప్రభుత్వం వివక్షతో మీసేవా నిర్వాహకుల్ని పూర్తిగా నిరాదరించిందని ఇప్పటి కూటమి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుకున్నారు.
ఇలా అనేక భూ ఆక్రమణ ఫిర్యాదులతో పాటు విజయవాడకు చెందిన మహిళ దివ్యాంగుడైన తన బిడ్డకు వినికిడి పరికరాలను అందించాలని కోరగా.. విజయవాడకే చెంది మరో వృద్ధురాలు పింఛన్ కల్పించాలని వేడుకుంది. అలగే నూజివీడు కు చెందిన మహిళ ఇళ్లు నిర్మాణంకు ప్రభుత్వ సాయం కావాలని వేడుకుంది.
తమ బిడ్డల చదువులకు సాయం చేయాలని మరికొందరు రాగా… నామినేటెడ్ పదవులకోసం నేతలు అర్జీలు అందించారు. అలాగే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వయసు రిత్యా ఉన్న సమస్యలను వివరిస్తూ బదిలీలకు అర్జీలు ఇచ్చారు. ఇవే కాకుండా వివిధ సమస్యలపై రాష్ట్ర నలు మూలల నుండి పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వారి అర్జీలను ఇచ్చి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి అర్జీదారుని సమస్యను వింటూ.. ఆ సమస్యలపై ఆయా శాఖల అధికారులు, నియోజకవర్గ నేతలతో ఫోన్లు మాట్లాడుతూ… వచ్చిన అర్జీలను వెను వెంటనేపరిష్కరించే విధంగా వినతుల కార్యక్రమంలో నేతలు కృషి చేస్తున్నారు. శాఖా పరమైన అర్జీలను ఆయా డిపార్ట్ మెంట్ లకు పంపిస్తూ చర్యలకు ఆదేశిస్తున్నారు.