“గంజాయి మత్తుపదార్ధాల వినియోగం, విచ్చలవిడి బైక్ రేసింగ్ లపైన ఉక్కుపాదం మోపటంలో గుంటూరు ఎస్పి ఎస్. సతీష్ కుమార్ కృషి అభినందనీయం ఈవ్ టీసింగ్ ర్యాగింగ్ అణిచివేసేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలని గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కోరారు.”
గుంటూరు జిల్లా నూతన ఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్ ని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కాలంలో గంజాయి మత్తుపదార్ధాల వినియోగంతో పాటు విచ్చలవిడి బైక్ రేసింగ్ లపైన ఉక్కుపాదం మోపేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
గత ప్రభుత్వ హయాంలో గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల గంజాయి అక్రమ రవాణా వినియోగం చాపకింద నీరులాగా విచ్చలవిడిగా జరిగేదని తద్వారా రాష్ డ్రైవింగ్ బైక్ రేసింగ్ తో పాటు మత్తులో మహిళల పైన అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు నిత్యం జరగటంతో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు అభద్రతాభావం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి కూడ ఎస్పిని కలిసి గంజాయి వినియోగాన్ని రూపుమాపి, అసాంఘిక శక్తుల పైన ఉక్కుపాదం మోపాలని కోరిన పరిసితుల్లో ఇటీవల జిల్లా పోలీసు ఏంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, గతంలో విద్యాసంస్థలో విద్యార్థులకు గంజాయి సప్లై చేసిన డీలర్లను గుర్తించి నార్కోటిక్ కేసులతో పాటు పి.డి యాక్టులు పెట్టి జిల్లా బహిష్కరణ చేయాలనీ కోరారు.