Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ నుంచి ఏపీకి ప్రత్యేక అతిథులు:పయ్యావుల కేశవ్‌

అనంతపురం : ఢిల్లీ నుంచి ప్రత్యేక అతిథులు ఏపీకి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అధికారులు రాష్ట్రానికి అప్పుల వసూళ్లకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. వాయిదాలు కట్టకుండా ప్రభుత్వరంగ సంస్థలు ఎన్‌పీఏ అయ్యాయన్నారు. దేశం గుర్తించేలా ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందని కేశవ్‌ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE