Suryaa.co.in

Andhra Pradesh

గురజాల అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

గురజాల కేంద్రంగా పల్నాడు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా గురజాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన గురజాల మేనిఫెస్టోని యరపతినేని విడుదల చేశారు. గురజాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లు వైసీపీ అరాచక పాలన సాగిందన్నారు.

గురజాలతో సహా ప్రతి నియోజకవర్గంలో గాలి, నీరు వదిలిపెట్టకుండా రాబందుల్లా దోచుకున్నారన్నారు. తమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ హత్యా రాజకీయాలతో 11 మంది చనిపోయారని చెప్పారు. 3000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, దోచుకోవడం దాచుకోవడమే తప్ప అభివృద్ధి సూన్యమన్నారు.

పోలింగ్‌ బూత్‌లను మార్చి వైసీపీ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక రాజధాని ఏంటో చెప్పలేని ఆవేదన ఆంధ్రుల్లో ఉందన్నారు. గురజాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సూపర్‌ సిక్స్‌ రూపందించడం జరిగిందని చెప్పారు.

LEAVE A RESPONSE