– మీడియా ప్రతినిధుల స్నేహ పూర్వక భేటీలో పీవీఎన్ మాధవ్
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం ప్రింట్ మీడియా పాత్రికేయులతో స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు. ఇరు వైపులా ఛలోక్తులు విసురుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చిట్ చాట్ సాగింది. అన్ని కోణాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
మీడియా ప్రతినిధులతో అడుగు వేస్తూ కలిసి ప్రయాణం చేస్తానని మాధవ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది నాలుగు సంవత్సరాలలోనే కనపడుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా తీర్చి దిద్దే విధంగా నా ప్రయాణం కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన విజయంతంగా పూర్తి చేసుకుందని మాధవ్ తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఏపీ లో ఎక్కువ మంది మంచి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఉన్నారు. యువతకి ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రాడ్యుయేట్ చేసి తగిన ఉద్యోగం ఉండక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో మంచి వనరులు, అవకాశాలు ఉన్నాయి.. కూటమి ప్రభుత్వంతో పెట్టుబడులు వస్తున్నాయి. అవకాశాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేసేందుకు మంచి అవకాశం ఉందని మాధవ్ అన్నారు. బోర్డు ఉండటం వల్ల వాటి ప్రభావం ఉంటుంది… ఎకానమీ పరంగా గ్రోత్ ఉంటుంది. అరకు లాంటి ప్రదేశాలలో స్పైసస్ ప్రాముఖ్యత ఉంటుంది. పబ్లిక్ లో మోదీ ఇన్ఫాక్ట్ బాగా ఉంది. మోదీ ప్రవేశపెట్టే ప్రతి పథకం లో ప్రధాన మంత్రి పేరుతో ఉండే పథకాలు ఉంటాయి. ఎక్కడ కూడా మోదీ పేరు ప్రస్థావించరు.. గత ప్రభుత్వాలు చూస్తే ప్రధాని పేరులతో పథకాలు పెట్టుకునేవారని తెలిపారు. కానీ మోదీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పేద ప్రజలకి మంచి చేస్తే చాలు అనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి పేరుతో మాత్రమే ఉంటాయన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేద వారు పథకాలు అందించాలినేది మోదీ ఉద్దేశమని, ఏపీలో బీజేపీ వారధి కార్యక్రమానికి మంచి స్పందన ఉందన్నారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు పాల్గొనటం వల్ల అసెంబ్లీ లో ఆయా సమస్యలపై లేవనేత్తడానికి అవకాశం ఉంటుంది. డినోటిఫైడ్ ట్రైబ్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బీజేపీ నేతలు ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.