– కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
కావలి: 100 అడుగుల జాతీయ జెండాతో, మహనీయుల చిత్రపటాలతో కావలి కి ప్రత్యేక గుర్తింపు రానుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందేలా కావలి పట్టణంలోని ఎంఎం బేకరీ సెంటర్ లో అన్న క్యాంటిన్ ఎదురుగా నిర్మాణం చేపడుతున్న 100 అడుగుల జాతీయ పతాకం కు సంబందించిన పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం పరిశీలించారు.
కావలి పట్టణానికి ఒక ఐకానిక్ ఉండేలా ఎమ్మెల్యే సొంత నిధులతో, స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కు తగు సూచనలు చేశారు.. డిజైన్ ప్రకారం త్వరితగతిన పనులు చేపట్టి ఆగష్టు 15న ప్రారంభం అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు..