– పార్టీ బలోపేతానికి రోడ్ మ్యాప్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
తిరుపతి: తిరుపతి ప్రాశస్త్యాన్ని కాపాడడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మాధవ్ నొక్కి వక్కాణించారు. సారథ్యం యాత్రలో భాగంగా తిరుపతి జిల్లాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సమావేశం లో మాధవ్ మాట్లాడారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం… తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు సమూహంతో ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటు కు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కార్యకర్తల హర్షధ్వానాలు నడుమ మాధవ్ ప్రకటించారు. తిరుపతిలో అన్యమత ఉద్యోగులు పై కూడా మాధవ్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ ఉన్న అన్యమత ఉద్యోగులను ఇతర శాఖల కు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి చేశాం. తిరుపతి నగరం స్మార్ట్ సిటీ గా వందల కోట్లతో అభివృద్ధి చేస్తాం. మతం పేరిట జరిగే ఘర్షణ లకు చరమగీతం పాడాలన్నారు.
జగన్ అరాచక పాలన
వైసీపీ ప్రభుత్వం లో పేదల సొమ్ము దారి మళ్లించి ఒక అరాచక పాలన జగన్ సాగించారు. అందువల్ల రాష్ట్రం నష్ట పోయిందని మాధవ్ అన్నారు. 14-15 ఆర్థిక సంఘం నిధులు రెండు కోట్లు నుండి 10 కోట్ల వరకు గ్రామ పంచాయతీ లకు నిధులు మంజూరు చేస్తే నిధులు కూడా వైసీపీ మాయం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్ డి ఎ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పథంవైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. అధికారంలోకి ఒక్క సంవత్సరం లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి లు వచ్చాయి. కేంద్రప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిచేస్తున్నాం. సంపద సృష్టి జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా తీసుకుని వచ్చి న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది అన్నారు.
ఎందరో మహానుభావులు త్యాగం చేసి బలమైన పార్టీ గా బీజేపీని రూపొందించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయులు వల్ల బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది. అటువంటి పార్టీ కార్యకర్తలు గా మనం గర్వపడాలి. కార్యకర్తల శ్రమ వృథా కానివ్వను. బీజేపీ బలపడడానికి ఒక రోడ్ మ్యాప్ ద్వారా కృషి చేస్తానని మాధవ్ ప్రకటించారు.