శ్రీపాద శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దివంగత “ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి పేరున నెలకొల్పిన “ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును” శ్రీపాద శ్రీనివాసుకు ప్రకటించారు.
శ్రీపాద తెలంగాణ ఆసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్షకార్యాలయం సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇతను రచించిన పలు కధలు, కవితలు ఇటీవల ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రం ద్వారా ప్రసారం కాబడ్డాయి. అదే విధంగా పలు ప్రముఖ పత్రికల్లో కూడ ప్రచురితం కాబడ్డాయి.సూర్య వెబ్సైట్లోనూ శ్రీపాద శ్రీనివాసు రచనలు ప్రచురితమయ్యాయి.
ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ కేంద్రం ద్వారా రేడియోలో ప్రసారం కాబడ్డ కధలు :
గోదావరి అలలలో అమ్మపిలుపు
నిరీక్షణ
అమ్మబీరువా
అంతరాత్మ – పరమాత్మ
వాస్తవిక దర్పణాలు వాట్సప్ గ్రూపులు
ఆత్మ బందువు… పండు టాకు, వందే భారత్ ట్రైన్ లో తొలి ప్రయాణం వంటి కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి.
శ్రీనివాస్ సంకలన కర్తగా : (1) “గుండె చప్పుళ్ళు” (2) “చట్టసభల్లో గోదావరి గళం” ప్రచురితం అయ్యాయి. మరియు మరో రెండు బుక్స్ preparationn లో వున్నాయ్
విద్యార్హతలు : (1) బి.కామ్. (2) జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ డిప్లోమా
(3) డిప్లోమా ఇన్ పర్సనల్ కంప్యూటర్ ఆపరేషన్