మాతృ దినోత్సవం సందర్భంగా శ్రీపాద శ్రీనివాస్ రచించిన ” అమ్మ ఒడి” భావ కవిత “ఆల్ ఇండియా రేడియో – హైదరాబాద్ కేంద్రం ద్వారా నేడు (14.05.2023) ప్రసారం అయ్యి “శ్రోతలను” విశేషంగా ఆకట్టుకుంది. రచయిత శ్రీపాద శ్రీనివాస్ తన స్వీయ వాయిస్ తో ప్రసారం ఆయిన ఈ భావ కవితలో అమ్మ ప్రేమ తియ్యదనాన్ని.. పుట్టిన ఊరుపై వున్న మమకారంతో ముడిపెట్టి చెప్పిన విధానం పలువురి ప్రశంసలను అందుకుంది. నాటి గ్రామీణ జీవితంలోని సంఘటనలను.. తీపి జ్ఞాపకాలను కూడా ఈ యొక్క భావ కవితలో చక్కగా వివరించబడింది.
గతంలో కూడా రచయిత శ్రీపాద రచించిన పలు కవితలు.. కథానికలు ఆల్ ఇండియా రేడియో,.హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారంకాపడి శ్రోతలను రంజింప చేశాయి. వాటిలో.. ” గోదావరి అలలలో అమ్మ పిలుపు”.. ” నిరీక్షణ”.. ” అమ్మ బీరువా”.. “ఆత్మ బంధం”.. ” అంతరాత్మ – పరమాత్మ”.. ” వాస్తవికతకు దర్పణాలు వాట్సప్ గ్రూప్ లు”.. ” పండుటాకు” .. ” వందే భారత్ ట్రైన్ లో తొలి ప్రయాణం”.. మరియు ” అమ్మ ఒడి” వంటి కార్యక్రమాలు వున్నాయి.
రచయిత శ్రీపాద గతంలో ” గుండె చప్పుళ్ళు” మరియు ” చట్టసభల్లో గోదావరి గళం” అనే పుస్తక సంకలనాలను కూడా రచించారు. “సూర్య వెబ్సైట్” లో కూడా అనేక రచనలను చేశారు.