-విజయోత్సవ ర్యాలీలు, బాణసంచాపై నిషేధం
-పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్
కౌంటింగ్ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. జిల్లాలో నలు మూలల కార్డన్ సెర్చ్ జరుగుతోందని, అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగి స్తున్నామని వివరించారు. భారీఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారిని పోలీసుస్టేషన్లకు పిలవా లని నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దని పల్నాడు జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు.
నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్
ఇటీవల ఎన్నికల్లో జరిగిన అల్లర్ల దృష్ట్యా మంగళవారం నరసరావుపేటలో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. పల్నాడు జిల్లా అడిషినల్ ఎస్పీ రామచం ద్రరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.