– నారా లోకేష్
ఇచ్చే పథకాలు కట్ చేయడంతో కటింగ్ మాస్టర్, లబ్ధిదారులకు అందకుండా సవాలక్ష అడ్డగోలు నిబంధనలతో ఫిటింగ్ మాస్టర్ గా నేను పిలిచే సీఎం జగన్ రెడ్డి అసలు పేరు స్టిక్కర్ మోహన్ రెడ్డి. టిడిపి ప్రభుత్వ హయాంలో పథకాలకు తన స్టిక్కర్ వేసుకున్న సీఎం, టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకూ రంగులు వేసుకున్నారు. నాలుగేళ్ల క్రితమే ధర్మవరం 28వవార్డులో టిడిపి పూర్తి చేసిన ఈ ఇళ్లు, లబ్ధిదారులకు అప్పగించకుండా శిథిలావస్థకి చేర్చారు. నేను పర్యటనకి వస్తున్నానని తెలిసి నాలుగు రోజుల నుంచీ తమ చేతగాని పాలనని కవర్ చేసుకునేందుకు టిడ్కో ఇళ్లకు కలర్ కొట్టారు.