Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు అడ్డుకోండి

– ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కోరారు. ఆ మేరకు ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, టీడీపీ నేత బుచ్చిరాంప్రసాద్ మీనాను కలసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏమన్నారంటే… అనంతపురం జిల్లా మా అభ్యర్థి రంగయ్య నామినేషన్ ఏ కారణం లేకుండా తిరస్కరించారు. ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్లు తేడాలు ఉంటే నామినేషన్ స్వీకరించేటప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ సరిచేయాలని, ఆ కారణం మీద నామి నేషన్ తిరస్కరించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికి, ప్రభుత్వ పెద్దల ఒత్తిడిలో రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ తిరస్కరించారు. స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని చట్టం చెప్పినప్పిటికి ఆయన పాటించలేదు.

కడప లోకల్ ఆధారిటి నామినేషన్ రమణయ్య నామినేషన్ కూడా తోసిపుచ్చారు. ప్రోపోజర్స్ గా సంతకం పెట్టిన ముగ్గురిని భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు, అధికార పార్టీ వారు కలిసి ఆ సంతకాలు ఫోర్జరీవి అని వారి చేత చెప్పించారు. ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించి ఆ సంతకాల నిగ్గు తేల్చాలని సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అదే విధంగా ప్రోపోజర్స్ ను భయబ్రాంతులకు గురి చేసి వారి ద్వారా స్టేట్ మెంట్లు తీసుకుని నామినేషన్ ను తిరస్కరించారు. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రోరల్ రోల్స్ ను సర్టిఫై చేయాల్సిన ఎమ్మార్వో అందుబాటులో లేకుండా చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా అందుబాటులో లేరు. ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయింది.

నెల్లూరు లోకల్ ఆధారిటి నామినేషన్ దేవిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ నామినేషన్ కూడా తోసిపుచ్చారు. అక్కడ కూడా ప్రోపోజర్స్ పై ఒత్తిడి తెచ్చి మా సంతకాలు కాదని చెప్పించి భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు, అధికార పార్టీ వారు కలిసి ఆ సంతకాలు ఫోర్జరీవి అని వారి చేత చెప్పించారు. పాలకపక్షం వారు ప్రజాస్వామ్య పద్దతులను హేళన చేస్తున్నారు. రాజ్యాంగ సూత్రాలు, ఎన్నికల కమిషన్ నియామవళి ఏది రాష్ట్రంలో అమలు కావడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేకుండా పోయింది. దీని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాము. ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నాము.

LEAVE A RESPONSE