ఎంపి విజయసాయిరెడ్డి
మే,2: ఆంధ్రప్రదేశ్ లో మూడున్నరేళ్లలో వైద్య,ఆరోగ్య రంగంలోరికార్డు స్ధాయిలో 48 వేలకుపైగా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం భర్తీ చేసిందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన పలు అంశాలను స్పందించారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సిపి ప్రభుత్వ మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించిందన్నారు.
ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త
ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. 2022 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను 2.73% మంజూరు చేసిందన్నారు.పెంచిన డీఏ 2.73 శాతాన్ని ఈ ఏడాని జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తూ..ఆగస్టు1 వ తేదీ వేతనాలతవ కలిసి నగదు రూపంలో చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లొ పెర్కోన్నారని చెప్పారు.