- ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తే చూస్తూ ఊరుకోం
- మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర
మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావుతో కలిసి పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా అనేది అత్యంత తీవ్రమైన నేరం. హక్కుల్ని హరిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయడం క్షమించరానిది. ఇలాంటి పనులు చేసే వారు ఎవరైనా, ఎంతటి వారైనా క్షమించేది లేదు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.