తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో సేవ్ పవర్ సేవ్ మనీ అనే కాన్సెప్ట్ తో విద్యార్థి సాయి నూతన పరికరం తయారు చేశాడు.యూనిట్ ఛార్జీలు పెరగడం మరోపక్క విద్యుత్ ఆదా చేయాలని ప్రభుత్వం తెలపడం ఇలాంటి పరిణామాల దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాన్ని రూపొందించానని విద్యార్థి పేర్కొన్నాడు.
ముఖ్యంగా విద్యుత్ తో వెలిగే లైట్ ద్వారా వెలువడే కాంతితో మరింత పవర్ జనరేటర్ అయ్యి బ్యాటరీ చార్జ్ అవుతుంది అన్నాడు…ఆ బ్యాటీరిలో ఉన్న పవర్ ద్వారా చార్జింగ్ లేక ఇతర లైట్ లు సైతం వెలుగుతాయి
అని విద్యార్థి స్థాయి తెలిపాడు..కేవలం విద్యుత్ లైట్ ద్వారా వచ్చే కాంతితో ఈ బ్యాటరీలోకి పవర్ జనరేటర్ అవుతుందని దీని ద్వారా సగానికి సగం విద్యుత్తు సేవ్ అవుతుందని పేర్కొన్నాడు.
పెరుగుతున్న విద్యుత్ చార్జీలు సేవ్ పవర్ సేవ్ మనికి ఈ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థి తెలియజేసాడు.ఇప్పటికే విద్యార్థి తయారు చేసిన ఈ నూతన పరికరం తుని పట్టణంలో కాఫీ హోటల్
నిర్వాహకులు ఉపయోగిస్తున్నారు .విద్యుత్తు ఆదాలో ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు సైతం పేర్కొన్నారు.