– డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్
బౌద్ధ నగర్ : నరేంద్ర మోడీ 75 సంవత్సరాల జన్మదిన పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 15 రోజులు సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నేతాజీ విద్యాలయాల యొక్క కరస్పాండెంట్ నిరంజన్ రెడ్డి సమక్షంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను బౌద్ధనగర్ లోని నేతాజీ స్కూలులో నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ పాల్గొని వికసిత్ భారత్. ఆత్మ నిర్బర్ భారత్. ఆపరేషన్ సింధూర్ గురించి వ్యాసరచన పోటీలు నేతాజీ స్కూల్లో నిర్వహించడం జరిగిందని, వ్యాసరచనలలో ఉత్తీర్ణులైన విజేతలకు మేమెంటోలు సర్టిఫికెట్లు అందించామని స్వరూప గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కనకట్ల హరి, దత్తు, అంబాల రాజేశ్వరరావు. సుధాకర్, కుమార్, నాగరాజు, ప్రమోద్, వెంకటేష్ ముదిరాజ్, జయంత్ సుబ్బారావు ఓమ్లు, టైలర్ అశోక్ వెంకటేష్, అమరావతి, ప్రభ, కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.