-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు
గుడివాడ:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై ఓ ప్రకటన ద్వారా స్పందించారు.
కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
దయచేసి విద్యార్థులు అపోహలను నమ్మవద్దని, ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దంటూ ఎమ్మెల్యే రాము సూచించారు.
ఎటువంటి వివక్షత లేకుండా గుడ్లవల్లేరు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని…. విద్యార్థినీ, విద్యార్థులెవరు ఆందోళన చెందవద్దనీ…. విద్యార్థి లోకానికి తాను అన్ని వేళల అండగా ఉంటానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఓ ప్రకటన ద్వారా విద్యార్థులకు భరోసా ఇచ్చారు.