హైదరాబాద్: నిజం కళాశాలలో విద్యార్థినిల ఆందోళన కొనసాగుతోంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను హాస్టల్ కు రమ్మని చెప్పి హాస్టల్ ఫెసిలిటీ కల్పించకపోవడంతో విద్యార్థునులు ధర్నాకు దిగారు. లగేజ్ తీసుకొని రావడంతో అంతా ఇబ్బందులు పడుతుననారు. కనీసం హాస్టల్లోకి అనుమతించకపోవడం, ఫుడ్ కూడా పెట్టడం లేదు. కొద్ది రోజులు సమయం కావాలని ఆ తర్వాతే హాస్టల్లోకి అనుమతి ఇస్తామని వార్డెన్ చెప్పడంతో ధర్నా చేస్తున్నారు. వర్షం పడుతున్న చీకట్లోనే సెల్ ఫోన్ టార్చ్ లైట్ లు ఆన్ చేసుకొని నిరసన తెలుపుతున్నారు.