Suryaa.co.in

National

డిప్యూటేషన్ పై ఆంధ్రకు ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు

ఢిల్లీ:  తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి యల్. సుబ్బరాయుడు డిప్యూటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ, వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కాగా గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్ద సుబ్బారాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. జగన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు అప్రాధాన్య పోస్టు ఇచ్చింది.

 

LEAVE A RESPONSE