– దేశంలోనే తొలిసారి
– పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లా
– ఫలితాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం
– పౌష్టికాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యం
– అందులో భాగంగానే ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు పంపిణీ
– తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క
ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం లోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలను ప్రతీరోజు అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ..
రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, అందులో భాగంగానే ఎక్కువగా వెనుకబాటు తనంతో ఉన్న మన ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని తెలిపారు. ముఖ్యంగా తల్లితండ్రులను కలిసి అంగన్వాడీకేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు.
అలాగే కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని అన్నారు.
అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ మరియు బాలి వివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఆనం మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్ల అభివృద్ధికి విఘాతం అని, కానా బాల్య వివాహాలను అడ్డు ములుగును బాల్యవివ్ రా జిల్లా గా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPO లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు &ఇతర ఎంత కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని మోడల్ గా తీసుకువచ్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్య విజయవంతానికి అంత కృషిచేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి గారు స్వాగతోపన్యాసంలో జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల తీరుతెన్నులను వివరించారు. ములుగు CDPO శ్రీమతి కూచన శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల పంపిణీని ప్రారంభించి ప్రీస్కూల్ చిన్నారులకు ఉచిత 100 మీ.లీ లీటర్ల పాలను అందించారు. ఈ కార్యక్రమంలో ITDA PO చిత్రామిశ్రా , అదనపు కలెక్టర్ మహేందర్ జీ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర , మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి , ములుగు ఆత్మ చైర్మన్ , వివిధ ICDS ప్రాజెక్ట్ CDPO లు, DCPO ఓంకార్, DMC రమాదేవి, ICDS సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, DCPU, CHL, సఖి, DHEW తదితర విభాగాల సిబ్బంది మరియు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.