Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన సుధ

కడప : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేసేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్రం మొత్తమ్మీద జగన్‌దే భారీ మెజార్టీ. 2019 ఎన్నికల్లో ఇదో రికార్డ్. అయితే ఆ రికార్డ్‌ను బద్వేల్‌ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందడం విశేషమని చెప్పుకోవచ్చు. అంటే జగన్ కంటే 440 ఓట్లు ఎక్కువ మెజార్టీనే. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తమ్మీద ఉన్న ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసేయడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి

LEAVE A RESPONSE