– కూటమి ప్రభుత్వ నిర్ణయం
– సీబీఐకి లేఖ రాయాలని నిర్ణయం
అమరావతి : సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు ను సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే సీబీఐకి అధికారికంగా లేఖ రాయనుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత, కేసును సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది.
పవన్ కల్యాణ్ ఒత్తిడితో గత వైసీపీ ప్రభుత్వం కేసు విచారణలో కొంత కదలిక తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే కీలకమైన సాక్ష్యాధారాలు లేకుండా పోయాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కేసును నిష్పక్షపాతంగా విచారించాలంటే సీబీఐ జోక్యం అవసరమని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, అధికారికంగా ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.