నందమూరి బాలకృష్ణ … ఆయనకిప్పుడు 63 సంవత్సరాలు..
అయనకు 23 ఏళ్ళ వయసు లో తండ్రి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి,
తరవాత సొంత బావ ముఖ్యమంత్రి.
గత 39 ఏళ్ళలో 22 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం ఆయనింటిదే.
ఇద్దరు బావలు ఎమ్.ఎల్.ఏ లు, ఆయన రక్తం పంచుకు పుట్టిన అన్న ఎమ్.పీ, సోదరి కేంద్రం లో కీలక మంత్రి పదవి…ఇప్పటికీ ఆవిడకు అధికార పార్టీ లో కీలక బాధ్యతలు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే గత 40 ఏళ్ళుగా, మధ్యలో 1989-94 తప్ప అధికారo ఆయనింటి గడప దాటలేదు.
అయినా ఈ రోజు వరకు ఒక్క అణా పైసా అవినీతి ఆరోపణ కాని, అధికార దుర్వినియోగ వ్యాఖ్యలు కాని, రాజకీయాల్లో సహజంగా ఉండే ఇదిగో తోక అదిగో పులి లాంటి ఆరోపణలు కూడా ఏనాడు రాలేదు.
వేలు విడచిన బామర్ది రాజకీయాల్లో ఉంటేనే ఈ రోజుల్లో వాళ్ళ హడావిడి, సంపాదన ఎలా ఉంటుందో చూస్తున్నాం.
చిన్న చిన్న హీరోలు కూడా బౌన్సర్స్ ను పెట్టుకుని బిల్డప్పులు కొట్టే ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా తిరిగే అగ్ర హీరో ఆయనే.
వృత్తి, రాజకీయాలు, బాధ్యతతో కూడిన సమాజ సేవ మధ్య స్పష్టమైన సమన్వయం తో ముందుకు సాగుతూ సమకాలీన హీరోల్లో ముందుండేది ఆయనే.
బాలయ్య చేత్తో కొడతాడేమో గాని కడుపు మీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతం గర్వం గా చెప్పుకునేది ఆయన గురించే.
అభిమానించడం మొదలు పెట్టిన అతి కొద్ది కాలం లోనే వ్యసనంగా మారేది ఆయన పేరే.
అలాంటి మనసున్న మారాజు, మా బంగారు బాలయ్యకి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
– నందమూరి సుహాసిని