– నా ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా
– నా ఫోన్ టాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదా?
– ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదు
– కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుంది
– ఇద్దరు ముఖ్యమంత్రులం కలిసే కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నాం.
-మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్
ఢిల్లీ: సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టలేదు. కవిత పంచాయతీ ఆస్తులు అధికారానికి సంబంధించింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ను సుప్రీంకోర్టు అడ్వైజ్ మాత్రమే చేయొచ్చు. ఆర్డర్ ఇవ్వలేరు.
ఫోన్ టాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులకు ఫోన్ లే టాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే, సూసైడ్ చేసుకోవడం ఉత్తమం. ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదు. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఫోన్ టాపింగ్ పై విచారణ జరుగుతుంది. ఫోన్ టాపింగ్ కోసం సిట్ ఏర్పాటు చేశాం. సిట్ అధికారులను నేను డిక్టేట్ చేయను. నా ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా. నా ఫోన్ టాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదా? ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా.
నీటి వివాదాల పరిష్కారం కోసం త్వరలోనే కమిటీ సభ్యులను సూచిస్తాం. సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులం కలిసే కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నాం.