జగన్ ఈ మధ్య రీన్యూ నేనే తెచ్చాను అన్నాడు. జగన్ బట్టలు విప్పేశాడు దాని అధినేత. 82 వేల కోట్లతో తమ ‘రీన్యూ’ తిరిగి రాకపై చైర్మన్ సుమంత్ సిన్హా ప్రసంగం విశాఖపట్నం సీఐఐ వేదిక మీద నుండి…. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రీన్యూ (ReNew) ఛైర్మన్ & CEO సుమంత్ సిన్హా ప్రకటించారు. సిన్హా మాట్లాడుతూ…
ఆరు సంవత్సరాల విరామం తర్వాత రీన్యూ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోకి తిరిగి వస్తున్నందుకు అత్యంత గర్వంగా ఉందని ప్రకటించారు. పవర్ సెక్టార్‌పై విడుదలైన వైట్ పేపర్ ప్రకారం, గత ఐదేళ్ల కాలంలో (2019 – 2024 మధ్య) రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం (New Renewable Capacity) ఏదీ అదనంగా రాలేదు అని ఆయన స్పష్టం చేశారు. సిన్హా కొనసాగిస్తూ… “ఈ రోజు మనం ఆ పరిస్థితిని మారుస్తున్నాము!” అని స్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమలులో ఉన్న కొత్త విధానం (New Policy) దార్శనిక నాయకత్వం కారణంగా, రాష్ట్రం మళ్లీ పెట్టుబడులకు సిద్ధంగా ఉందని తెలిపారు.

