– విచారణకు మూడు వారాల గడువు కావాలట
– ఎస్పీ దామోదర్ ను కోరిన ఐపీఎస్ సునీల్
– వారం రోజులు ఇచ్చే అవకాశం?
విజయవాడ: నాటి నరసాపురం మాజీ ఎంపీ- ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ..ఏ వన్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణ, ఇంకా ఆలస్యం అవుతోంది. నిజానికి ఈనెల నాలుగున విచారణకు హాజరుకావాలని, ఆ కేసు విచారణ అధికారి అయిన విజయనగరం ఎస్పీ దామోదర్, ఆయనకు గత వారం నుండి నోటీసు పంపించారు.
అయితే తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున, విచారణకు హాజరయ్యేందుకు తనకు మూడు వారాలు గడువు ఇవ్వాలని సునీల్ ..ఎస్పీని కోరినట్లు సమాచారం. నిజానికి సునీల్ విచారణ కోసం ఎస్పీ దామోదర్ విజయనగరం నుంచి, విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్ కు మూడు వారాల గడువు ఇచ్చే అవకాశం లేదని ..ఒక వారం గడువు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సునీల్ ను విచారణకు పిలవలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఐపిఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్‌ను అరెస్టు చేసి ,జైలుకు పంపించిన ప్రభుత్వం.. సునీల్ మాత్రం ఇప్పటివరకు, కనీసం విచారణకు పోవడంపై టిడిపి వర్గాల్లోనే, అసంతృప్తి వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.