– మహిళలు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు జగన్ సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది
– ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ
విజయవాడ: చిన్న పిల్లలను భయపెడితే మాట వింటారు… ముఖ్యమంత్రి జగన్ కోర్టు మొట్టికాయలు వేస్తేనే మాట వింటారు. కోర్టుల చుట్టూ తిరిగి… తిరిగి కోర్టు ద్వారా చివాట్లు తింటేనే జగన్ కు మానసిక ఆనందం. అమరావతి రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.ఏపీ హైకోర్టు తీర్పు అమరావతి రైతుల మరో చరిత్రాత్మక విజయం.
అమరావతి శాశ్వతం అని తాము ముఖ్యమంత్రి జగన్ కి ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ కంకణం కట్టుకున్నారు అందుకే ఎవరు అడగకపోయిన మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు.
వ్యవసాయం తప్ప ఏం తెలియని మట్టి మనుషులు, ఒక రాక్షసుడితో ధర్మ పోరాటం చేస్తున్నారు. అమరావతి మహిళలు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా హైకోర్టు తీర్పును అమలు చేయాలి. హైకోర్టు తీర్పు అమరావతి రైతుల విజయం మాత్రమే కాదు 5 కోట్ల ఆంధ్రుల విజయం.