అసదుద్దీన్ పాలస్తీనా వెళ్లి వారకి మద్దతు ఇవ్వాలి
టెర్రరిస్టు సంస్థ కు మద్దతుగా ర్యాలీ తీస్తే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు ?
ఏ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కూడా ఏనాడూ కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.
హరీష్ రావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరం
ఓడిపోతుందన్నప్పుడు బూతులు మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటే
నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ నగరం
హైదరాబాద్ పేరు, ప్రతిష్టను బిఆర్ఎస్ దొంగలిస్తామంటే ప్రజలు ఒప్పుకోరు
కర్ణాటకలో కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చింది కేసీఆరే
బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు
హైదరాబాద్. మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందంటూ వ్యాఖ్యానించడం సరికాదని, ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఓడిపోతుందన్నప్పుడు బూతులు మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటేనని, హరీష్ రావు, ఆయన మామ పుట్టుక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉందని చురకలంటించారు. నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ ఉందన్నారు. అనేక సాంస్కృతిక , సాంప్రదాయాలకు హైదరాబాద్ కేంద్రమని, దీనిపై చర్చకు బీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి , తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడిన ముఖ్యాంశాలు:
హరీష్ రావు, ఆయన మామ పుట్టుక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉంది. నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ నగరం ఉంది.అనేక సాంస్కృతిక , సాంప్రదాయాలకు హైదరాబాద్ కేంద్రం. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారం, వాణిజ్యం, సాహిత్యం, కలలకు మారుపేరుగా వెలసిల్లింది హైదరాబాద్ నగరం ఆ కాలంలోనే హిస్టరీ బుక్ లో పెద్ద నగరంగా, ధనిక నగరంగా, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరంగా ఉండేది. ఇది నిజంకాదా..? దీనిపై కేసీఆర్ చర్చకు సిద్ధమా..?
బిఆర్ఎస్ పుట్టుకకు, హైదరాబాద్ కు సంబంధం లేదు. హైదరాబాద్ పేరు, ప్రతిష్టను బిఆర్ఎస్ దొంగలిస్తామంటే ప్రజలు ఒప్పుకోరు.తెలంగాణ ప్రజలు కష్టపడితే నగరం ఈ స్థాయికి చేరుకుంది.టాలీవుడ్ సినిమాలకు కేరాఫ్ హైదరాబాద్. ముంబై కంటే దీటుగా అతితక్కువ రోజుల్లో సినిమాలను నిర్మించగలిగే సత్తా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉంది. దీనికి బిఆర్ఎస్ కు ఏం సంబంధం?
జనరిక్ మెడిసిన్ ఉత్పత్తిలో భారతదేశంలో అతి ముఖ్యమైన నగరం హైదరాబాద్. ఇందులో బిఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఏంటి? ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న నగరం హైదరాబాద్. వ్సాక్సిన్ నగరంగా హైదరాబాద్ మారడంలో బిఆర్ఎస్ పాత్ర ఏంటి? విశ్వవిద్యాలయాల హబ్ గా ఉన్న నగరం గా హైదరాబాద్ మారడంలో బిఆర్ఎస్ పాత్ర ఏంటి..?
కాకతీయ, కులీకుతుబ్ షా , నిజాం చరిత్ర చూస్తే తెలంగాణ నుంచి అమెరికా కు డాక్టర్ లు, ప్రొఫెషనల్స్, ఇంజనీర్ లు పోవడం లో బిఆర్ఎస్ పాత్ర ఏంటి..?హైదరాబాద్ లో మాఫియా రాజ్యం పోవాలంటే, వేగంగా అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పోవాలి.గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాకతీయుల కాలంలో కట్టిన చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. నగరం లో ఆలయాల భూములు, చెరువులు , కుంటలు మాయం అయ్యేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు ప్రభుత్వం మాఫియా కారణం కాదా..?
కాంగ్రెస్ , బీఆర్ఎస్ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫాల్స్ డిస్కషన్ చేస్తున్నారు.బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట జైలుకు వెళ్లేది భూ మాఫియానే. ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేటుపరం చేసి కుటుంబ ఆదాయంగా మార్చుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్-బీఆర్ఎస్ జీవితకాలమంతా పార్టనర్స్. వాళ్ల పోటీ అంతా నాటకమే. కర్ణాటకలో కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చింది కేసీఆరే. ఎక్కడెక్కడ ఒకరికి ఒకరు సహకరించుకున్నారో బయటపెడుతాం. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి చేస్తున్న పోరాటంపై ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొగబెడుతున్నాయి. దొంగతనంలో వాటాదారులు కాంగ్రెస్, బీఆర్ఎస్.
హమాస్ తీవ్రవాద దాడిని మొదట ఖండించింది భారత ప్రధాని మోదీ . కాని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఇంతవరకు ప్రకటించలేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బిజెపి కార్యకర్తలను జైలులో వేస్తున్నది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో హమాస్ కు మద్దతు గా ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. హమాస్ కు మద్దతు ఇస్తాం అంటే భారతదేశంలో అసదుద్దీన్ కు స్థానం లేదు. అసదుద్దీన్ పాలస్తీనా వెళ్లి వారకి మద్దతు ఇవ్వాలి. బీఆర్ఎస్, ఎంఐఎం లు హమాస్ కు మద్దతు ఇస్తున్నాయి.
హైదరాబాద్ లో హమాస్ ఉగ్రసంస్థకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ఆ ర్యాలీలను ప్రోత్సహిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు హమాస్ కు మద్దతిస్తున్న మజ్లిస్ రాజకీయాలకు మద్దతిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే హమాస్ కు మద్దతు గా ర్యాలీ లు ఉండవు.ఒక టెర్రరిస్టు సంస్థ కు మద్దతుగా ర్యాలీ తీస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు ..?
ప్రజాసమస్యల పై పోరాటం చేస్తే మహిళలు, ప్రజలపై పోలీసులతో దాడులు చేస్తున్నారు.రైతులకు బేడీలు వేస్తూ, మహిళలను చితకబాదుతున్నరు. విద్యార్థి నాయకులపై లాఠీలు జులిపిస్తున్నరు.భారత్ మాతా కీ జై అంటే జైలులో వేస్తున్రు. సెప్టెంబరు 17న జాతీయ జెండా ఎగురవేస్తే అడ్డుకుంటున్నది. టెర్రరిజం తో అత్యదికంగా నష్టపోయింది భారతదేశం. హమాస్ ఉగ్రవాదమే కాకుండా.. ఏ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కూడా ఏనాడూ కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా చేసుకుంటున్న పొత్తులు తెలంగాణ కు నష్టం. బిఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే. దేశంలో వెనుకబడిన వర్గాల కు చేయూత నిచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది . భారతదేశ చరిత్ర లో ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలు కేంద్ర మంత్రులుగా లేరు.