Suryaa.co.in

Editorial

హిందువుల ‘పెళ్లిపందిరి’ కూలింది!

– ఆర్య సమాజ్ పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదట
– ఆర్యసమాజ్ సర్టిఫికెట్లు చెల్లవన్న సుప్రీంకోర్టు
– అపీలుకు వెళ్లే యోచనలో ఆర్యసమాజ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

అది కొన్ని శతాబ్దాల నుంచి కులాంతర వివాహాలు ప్రోత్సహించి, వైదిక ధర్మంలో సంస్కరణల కోసం ఏర్పాటుచేసిన హిందూ వేదిక. స్వామి దయానంద సరస్వతి పురుడుపోసిన హైందవ విప్లవాత్మక వివాహ వ్యవస్థ. అన్నింటికంటే మించి.. పేదలకు ఖర్చు లేకుండా ఉచిత వివాహాలకు వేదికగా నిలిచిన వ్యవస్థ
arya2 అది. తరాలు మారిన తర్వాత, ఇప్పుడది ప్రేమికులకు పెళ్లిపందిరిగా మారింది. అలాంటి ఎన్నో వేల జంటలను ఒకటి చేసిన ‘పెళ్లిపందిరి’ కూలిపోయింది. అక్కడ జరిగే పెళ్లిళ్లు, ఆ వ్యవస్థ ఇచ్చే ధృవీకరణ పత్రం చెల్లదంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానితో దయానందుడు పురుడుపోసిన ఆర్యసమాజ్ వివాహ వ్యవస్థకు, కాలం చెల్లే ప్రమాదం ఏర్పడింది. అయితే.. కులం గోడను బద్దలు కొట్టి, హిందూ వ్యవస్థను బలోపేతం చేసే ఈ విధానాన్ని పరిరక్షించుకునేందుకు, ఆర్యసమాజం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

దయానందుడి సంస్కరణల ఫలితమే..
వేదోపనిషత్తులు ఔపోసన పట్టిన దయానంద సరస్వతి.. హిందువుల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, ఆచారాలు, కుల-మత-వర్గ విబేధాలను రూపుమాపేందుకు ప్రారంభించిన సంస్కరణల్లో ప్రధానమైనది ఆర్యసమాజ స్థాపన. హైందవ సమాజాన్ని వేదమార్గం పట్టించేందుకు, ఆయన ప్రారంభించిన ఆర్యసమాజానికి అద్భుత స్పందన లభించింది. కుల-మత-వర్గం- అంటరానితనం అనే అనాచారాల
arya-hyd వైపు అడుగులు వేస్తున్న హిందూ సమాజాన్ని దయానందుడు ఆర్యసమాజ్ వైపు మళ్లించారు. వేలమంది కులాంతర-మతాంతర వివాహాలు చేసుకోవడం ప్రారంభమయింది. చివరకు హిందూ మతం నుంచి నిష్క్రమించిన వారిని సైతం, ఆర్యసమాజం తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. కులాలుగా విడిపోయిన హిందూ సమాజాన్ని దారిలోపెట్టేందుకు దయానందుడు స్థాపించిన పెళ్లిపందిరి ఇది.

దేశవిదేశాల్లోనూ పెళ్లిళ్లు..
దేశంలో ప్రేమపెళ్లిళ్లు, పేదల వివాహాలకు వేదికగా నిలిచిన ఆర్యసమాజ్ , ఐదు శతాబ్దాల నుంచి వధూవధురులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై చెల్లవంటూ, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, హిందూarya-1సమాజంలో చర్చనీయాంశంగా మారింది. వైదిక ధర్మంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్యసమాజ్, ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, అనేక దేశాలకూ విస్తరించింది. ఆంధ్ర-తెలంగాణలోనే 35 శాఖలుండగా, భారతదేశంలో 500 పైనే ఉన్నాయి. ఈ వ్యవస్థకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, టాంజానియా, సింగపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, మెక్సికో వంటి దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడ ఆర్యసమాజ్ శాఖలు స్థాపించారు.

ఆ చట్టం ప్రకారమే పెళ్లి, సర్టిఫికెట్లు..
ముస్లిం, క్రైస్తవుల మాదిరిగానే.. హిందూ వివాహ చట్టంలో అంతర్భాగంగా.. ఆర్య మ్యారేజ్ వేలిడేషన్ యాక్ట్-1937 ఏర్పడింది. దీని ప్రకారం.. పెళ్లి చేసుకునేవారు మూడురోజుల ముందు ఆర్యసమాజ్‌ను సంప్రదించి, పెళ్లి కొడుకు-పెళ్లికూతురు వైపు నుంచి ఇద్దరేసి సాక్షులను తీసుకురావలసి ఉంది. ఆ
arya-samaj-marriage-certificateతర్వాత ఆర్యసమాజమే వారికి హిందూ పద్ధతిలో పెళ్లిచేసి, సర్టిఫికెట్ ఇస్తుంది. సహజంగా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలంటే నెలరోజుల ముందు సమాచారం ఇవ్వాలి. తర్వాత అధికారులు అభ్యంతరాల స్వీకరణ కోసం నోటీసు ఇస్తారు. ఆ సందర్భంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆ పెళ్లిని అధికారులు అంగీకరించరు. కానీ, ఆర్యసమాజంలో వారం రోజుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుండటంతో, చాలామంది ప్రేమజంటలు అక్కడే ఒక్కటవుతున్నారు. కొత్తగా వచ్చిన మార్పుల నేపథ్యంలో, ఇప్పుడు జంటల నుంచి ఆధార్‌కార్డు, సాక్షుల పద్ధతి ప్రవేశపెట్టింది. ముందు ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుని, తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే సంప్రదాయం ప్రారంభమయింది.

కిం కర్తవ్యం?
ఇకపై ఆర్యసమాజ్‌లో జరిగే పెళ్లిళ్లకు, అది ఇచ్చే సర్టిఫికెట్లు చెల్లవని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఇది సహజంగానే హిందూ సమాజంలో చర్చకు తెరలేపింది. పెళ్లికి సర్టిఫికెట్లు చెల్లవని
arya సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గానీ, ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా పేర్కొనపోవడం గమనార్హం. సహజంగా పెళ్లిళ్లు గుళ్లలో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు పోలీసుస్టేషన్లు, పెద్దల సమక్షంలో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంటే సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి, ప్రేమికులు సహజంగా అటు వైపే చూస్తారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో, ఇకపై ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకునే అవకాశాలు తక్కువే.

చిరంజీవి కూతురి నుంచి.. యూట్యూబర్ బబ్లు వరకూ అక్కడే పెళ్లిళ్లు
srija-sirishఆర్యసమాజ్‌లో అనేక మంది ప్రముఖుల కుమారులు, కుమార్తెల పెళ్లిళ్లు జరిగాయి. తలిదండ్రులకు చెప్పకుండా బయటకు వచ్చి, పెళ్లి చేసుకునే వారికి ఆర్యసమాజం దన్నుగా నిలుస్తుంది. ఆ కోవలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ- శిరీష్ భరధ్వాజ ప్రేమ సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని ఆర్యసమాజంలో పెళ్లిగా మారింది. వారి పెళ్లిని ఢిల్లీ హైకోర్టు కూడా అంగీకరించింది. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న వారిద్దరూ తర్వాత, రిజిస్టర్ మ్యారేజీ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారిద్దరూ అభిప్రాయబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అది వేరే విషయం. తర్వాత తాజాగా ప్రముఖ యూట్యూబర్ బుమ్‌చిక్‌బబ్లు కూడా ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుని, వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఇలా చాలామంది సెలబ్రిటీలు, వారి వారసుల రహస్య పెళ్లిళ్లకు ఆర్యసమాజం వేదికగా మారింది.

అపీలుకు వెళ్లే ఆలోచనలో ఆర్య సమాజ్?
శతాబ్దాల నుంచి విజయవంతంగా నడుస్తున్న ఈ హిందూ వివాహ వ్యవస్థ విధానాలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టిన నేపధ్యంలో, హిందూ సంస్థలు ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా vittalrao-aryaతీర్పు కాపీ వచ్చిన తర్వాత, అపీలుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘సుప్రీంకోర్టు ఆదేశాలను మేం గౌరవిస్తాం. సుప్రీంకోర్టు ఆర్య సమాజంలో జరిగే పెళ్లిళ్లకు ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదని చెప్పిందే తప్ప, పెళ్లిళ్లు చెల్లవని చెప్పలేదు. పెళ్లి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏదేమైనా తీర్పు కాపీ రాకుండా ఇప్పుడే వ్యాఖ్యానించలేం. ప్రతి దానికీ ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. మేం కూడా అదే మార్గంలో వెళతాం. అపీలుకు వెళ్లే హక్కు కూడా ఉంది కదా? దయానందుడి మార్గాన్ని అనుసరించడమే మా కర్తవ్యం. ఇది హిందూ వివాహచట్టానికి అనుగుణంగా, ఆర్య మ్యారేజ్ వేలిడేషన్ యాక్ట్-1937లో ఏర్పడింది. దీనికి చట్టబద్ధత ఉంది. ప్రజల్లో ఆర్యసమాజానికి క్రెడిబిలిటీ ఉంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే కాదు, కొనసాగించడం మా అందరి బాధ్యత’ అని హైదరాబాద్‌కు చెందిన, ఆలిండియా ఆర్యసమాజ్ ప్రధాన కార్యదర్శి విఠల్‌రావు ఆర్య వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE