Suryaa.co.in

National

బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ

రెండు నెలల్లో రూ. లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

రూ. లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ. 10 లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించు కోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ లకు ఇవ్వాలని తెలిపింది.

LEAVE A RESPONSE