– కులగణన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు
– ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలి
– ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు
– రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎత్తి వేస్తాం
– కులగణన సంప్రదింపుల సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత.. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
హైదరాబాద్: టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను డీ కొని 20 నిమిషాలలలో మునిగిపోయింది. ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలింది.
అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉంది. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది. దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాను. అందుకే కులగణన అనేది అత్యంత కీలకం.
కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలి. ఏదైనా వ్యాధి తెలియాలంటేఎక్సరే చేయాలి కదా? మేము కులగణన చేస్తం ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని.మోడీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు.? మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా? కులగణన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించాము.
తెలంగాణ లో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. తెలంగాణ కులగణన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు. ప్రజల నుంచి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలి. తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు. వివక్ష తొలగించి అందరికి అందరికీ సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తాం.
ప్రజలకు కనిపించకుండా కులవివక్ష ఉంటుంది. కుల వివక్ష అగ్రవర్ణాల లో లేదు. భారత రాజ్యాంగానికి కులవివక్ష వల్ల ముప్పు.. కులగణన ద్వారా వ్యవస్థలను సరిచేయొచ్చు అన్ని చోట్ల కులవివక్ష ఉంది.రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థ ల్లో ఇది ఉంది.
ఆత్మవిశ్వాసాన్ని కులవివక్ష దెబ్బ తీస్తుంది. కుల వివక్ష ఉందని ఒప్పుకోవాలి. కులగణన చేయమన్నందుకూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాని బీజేపీ, మోదీ అంటున్నారు. నిజం చెప్పడం విభజించడమా? కులగణనతో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీ లు ఉన్నరో తేలుతుంది. దాని ద్వారా నిధులను పంచుతాం.
కార్పొరేట్ ఇండియా లో ఎంత మంది దళితులు, ఆదివాసీ లు,ఓబీసీ లు ఉన్నారు.? కులగణన కు వ్యతిరేకంగా ఉన్నారు కులవివక్ష కు అనుకూలంగా ఉన్నవారే. ప్రధాని ఒక్కసారి కూడా కులవివక్ష గురించి మాట్లాడలేదు. ఎందుకు కులగణన కు మోడీ భయపడుతున్నారు?
జాతీయ స్థాయిలో కులగణనన చేస్తామని పార్లమెంట్ లో చెప్పాను. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న నిబంధనను ఎత్తి వేస్తాం. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలి.బ్యూరోకటిక్ కులగణనన వద్దు…పేదల కోణంలో కులగణన జరగాలి. కులగణన ద్వారా అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కులగణన భవిష్యత్ కు మార్గనిర్దేశం అవుతుంది.
దేశంలో ని దళితుల విషయంలో అంటరాని తనం ఉంది..ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో లో మన దేశంలో నే కులవివక్ష అధికంగా ఉంది. దేశం అన్ని విధాలుగా ఎదగాలంటే కులవివక్షను అరికట్టాలి. కులవివక్ష లేదని నేను దళితులు, ఆదివాసీలు, ఓబీసీ లకు అబద్దాలు చెప్పలేను.. కులగణనన లో కొన్ని పొరపాట్లు జరగొచ్చు..కాని సరిచేసుకుంటాం.