స్థలం: రాప్తాడు (అదేనండి, పెళ్లి పందిరి!)సమయం: రఫ్ఫా రఫ్ఫా హడావుడిలో…మన తాడేపల్లి గోదావరిబాబు ఉన్నాడూ… పెళ్లికొచ్చాడు. ఎందుకొచ్చాడంటే, పందిరిలో జనం లేక కాదు, తోపుదుర్తి పెళ్లివారికి ఏమాత్రం చుట్టం కాకపోయినా వచ్చాడు! అసలు సంగతి ఏంటంటే, ఈయనగారు మన రఫ్ఫా రఫ్ఫా పెయిడ్ ఆర్టిస్ట్ అట! తాడేపల్లి నుండి రాప్తాడు దాకా స్పెషల్ ప్యాకేజీలో దిగాడు! స్కాముల బాద్ షా దర్శనం – అభిమాని లక్ష్మీరెడ్డి గారి వైరాగ్యం! ఇక, అనంతపురం సైడ్ నుంచి ఒక ప్యూర్ ఫ్యాన్ వచ్చాడు. ఆయనే మన గంగన లక్ష్మీరెడ్డి గారు. ఈయనగారికి పాత స్కాములు ($43,000$ కోట్లవి!), కొత్తగా మరిన్ని వేల కోట్ల లిక్కర్ స్కాములు, సాండ్ స్కాములు చేసిన ఆ… జగన్ గారిని ఒక్కసారి చూస్తే చాలన్నంత ఆరాటం! భక్తుడంటే ఈయనే కదా! పెళ్లి వేదిక పెయిడ్ ఆర్టిస్టుల అరుపులతో దడదడలాడుతోంది, అందరూ ఫోటోల బిజీలో ఉన్నారు.
కట్ చేస్తే… మన తాడేపల్లి పెయిడ్ ఆర్టిస్ట్ గోదావరిబాబు, పక్కనే ఉన్న భక్తుడు లక్ష్మీరెడ్డి జేబులో చెయ్యి పెట్టి, కరెక్ట్‌గా ఇరవైవేల రూపాయలు లేపేసి, పరుగు అందుకున్నాడు! ఈయనగారికి జగన్ ప్యాలెస్ ఇచ్చే ప్యాకేజీలో సరిపోక కాదు! పెళ్లి పందిరిలో జేబులు లేపితే… రిమాండ్ పందిరిలో సీటు గ్యారంటీ అని కాబోలు. “అయ్యయ్యో! సార్! లబోదిబో! నా పరుసు! నా ఇరవై వేలు” అంటూ మన లక్ష్మీరెడ్డి గారు ఏడ్చి మొత్తుకుంటూ, తన స్కాముల హీరో దర్శన మైకంలో పోయిన డబ్బుల గురించి రాప్తాడు పోలీస్ స్టేషన్లో రచ్చ చేస్తూ.. ఫిర్యాదు చేశాడు. ‘మంచి ప్రభుత్వం’ కదా! పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
సోమవారం ఉదయాన్నే, రాప్తాడు సమీపంలోని పంగల్ రోడ్డులో ఉన్న… సాక్షాత్తూ ‘జగన్ ప్యాలెస్’ వుండే తాడేపల్లి వాస్తవ్యుడు గోదావరిబాబుని పట్టుకున్నారు! చేసిన నేరం ఒప్పుకున్నాడు. జేబు లేపే ఆర్టిస్టు – పార్టీకి ఫ్యూచర్ మినిస్టర్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ: పెళ్లికి పెయిడ్ ఆర్టిస్టులను పిలిపించడం ఎంత ప్రమాదమో చూశారా? స్కామ్ హీరోల ఫ్యాన్స్ జేబులు కూడా సేఫ్ కావు! దీనికి కూడా మళ్లీ మంచి ప్రభుత్వ రక్షణ కావాలి. కర్మ. పురాణాల్లో స్వయంవరంలో వీరుడిని వరుడుగా ఎన్నుకొనేవారు. పులివెందుల మండలంలో డిపాజిట్ పోయినప్పటి నుండి ఆహ్వానించిన ప్రతి పెళ్లి వేదికను, తన స్వయంవరం లెక్కన మార్చుకొని, జనం వచ్చారని జగన్ తనను తాను మోసపుచ్చుకుంటుంటే.. అభిమానులు ఇలా రఫ్ఫారఫ్ఫాలాడిస్తున్నరు పెళ్లి పందిళ్లలో. – చాకిరేవు