Suryaa.co.in

Andhra Pradesh

తదేకం ఫౌండేషన్ – జనసేన సంయుక్త సేవా కార్యక్రమాలు అభినందనీయం

మహావతార్ బాబాజీ స్ఫూర్తితో గురూజీ నౌషీర్ ప్రారంభించిన ‘తదేకం ఫౌండేషన్’ చేస్తున్న సామాజిక సేవా, సంక్షేమ కార్యక్రమాలు అందరిలో సేవా దృక్పథాన్ని కలిగిస్తున్నందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో కలసి తదేకం ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మహిళలకు, వికలాంగులకు ఉపయుక్తంగా ఉన్నాయని చెప్పారు. వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇవ్వడంతోపాటు మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మెషిన్లు అందచేస్తున్నారు అన్నారు. తదేకం ఫౌండేషన్, జనసేన సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలను ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సుధ జనసేన పార్టీ అధ్యక్షులకు వివరించి గురూజీ పంపిన సందేశాన్ని అందచేశారు. అనంతరం జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తమ వంతుగా ఫౌండేషన్ తరఫున రూ.5 లక్షల విరాళం అందచేశారు. ఈ సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE