-ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నాడు?
-కంటెయినర్ ఎందుకు వచ్చిందో. సమాధానం చెప్పాలి
-నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి
-బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం
విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారు. లక్ష మంది తో సభ అనుకుంటే.. ముప్పై వేల మంది కూడా రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జనగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పురందేశ్వరి పై వ్యాఖ్యలు చేసిన జగన్ దమ్ముంటే విచారణకు సిద్దమా? గంజాయి, కొకెయిన్, వంటి డ్రగ్స్ కు ఏపీ కేరాఫ్ అడ్రస్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.
విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చేశాడు? ఇప్పుడు ఎన్నికల లో లబ్ది పొందాలని పురందేశ్వరి, చంద్రబాబు పై నిందలు మోపుతారా? నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి.. అవసరం తీరాక కరివేపాకులో తీసిపారేస్తావా? ఏపీ నాశనం అవడానికి జగన్ ప్రధాన కారణం. దీనిపై చర్చకు ఎవరైనా సిద్దమా అని సవాల్ చేస్తున్నాం. జగన్ అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు?
మహిళలు అని చూడకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి జగన్ కు సిగ్గు అనిపించడం లేదా సొంత చెల్లి షర్మిల, మరో చెల్లి సునీత లు అడిగే వాటికి సమాధానం చెప్పలేక పోతున్నారు. సజ్జల అనే వాడిని పంపి అతనితో ఆడవాళ్లను తిట్టిస్తున్నారు. ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తేలిపోవడంతో, జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.
నేడు జగన్ కు కనీసం ఎంపీలు దొరికే పరిస్థితి లేక బతిమాలుకుని అభ్యర్దులను పెట్టుకున్నారు. వివేకా కేసు ను సీబీఐకి ఇవ్వాలన్న జగన్ హైకోర్టులో పిటిషన్ వెనక్కి ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. రాష్ట్రంలో జరిగే ప్రతి అరాచకానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. నాపై యుద్దానికి అందరూ కలిసి వస్తున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ ఓడిపోవడానికి సిద్దంగా ఉన్నారు… ఇంటికి వెళ్లడం ఖాయం.
అబద్దాలు సృష్టించి అసలు విషయం డైవర్ట్ చేయడంలో జగన్ సిద్దహస్తులు. జగన్ ఇంటికి కంటెయినర్ ఎందుకు వచ్చిందో… సమాధానం చెప్పాలి. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని జగన్ చూస్తున్నాడు. ప్రజలు మాత్రం జగన్ కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. పురందేశ్వరి పై ఇంకోసారి నోరుపారేసుకుంటే తగిన బుద్ది చెబుతాం.
సీట్లు అడిగే అర్హత జగన్ కు ఉందా?: ఆదోని బీజేపీ అభ్యర్ది డాక్టర్ పార్ధసారధి
నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలకు నా ధన్యవాదాలు. సిద్ధం సభ లతో జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మా మ్యానిఫెస్టో ను 95శాతం పూర్తి చేసి ప్రజల్లోకి వచ్చామని చెప్పడం పచ్చి అబద్దం. 125 హామీలు ఇచ్చిన జగన్ ఎన్నింటినీ అమలు చేశారో చర్చకు సిద్దమా? సగం హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెట్టారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకు వచ్చారు
రాయలసీమలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి, నీటి సమస్య తీరుస్తామని జగన్ చెప్పలేదా? జలయజ్ఞం పేరుతో నవరత్నాల్లో ఒక రత్నం పెట్టి ఐదేళ్లుగా ఏమీ చేయకుండా మోసం చేయలేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కొద్దిపాటి పనులు చేశారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని ప్రజల తరపున సూటిగా ప్రశ్నిస్తున్నా.
ఉచితంగా ఇల్లు ఇస్తామన్న జగన్.. ఇంటి స్థలాల పేరుతో కోట్లు దోచేశారు. మద్యపాన నిషధం అన్న జగన్.. మాట తప్పి.. మద్యాన్నే అమ్మే ప్రభుత్వంగా మార్చారు. సొంత మద్యాన్ని తయారు చేసి రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చి సీట్లు అడిగే అర్హత జగన్ కు ఉందా?కేంద్రం నిధులు ఇస్తే.. వాటికి మీ స్టిక్కర్లు వేసుకుని వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. ప్రజలకు కూడా పూర్తి వాస్తవాలు అర్దం అయ్యాయి.. తప్పకుండా బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు
151 సీట్లు ఇస్తే జగన్ చేసిన నిర్వాహకం చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.15 సీట్లు కూడా ఇవ్వకుండా జగన్ ను సాగనంపుతారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయ ప్రభంజనంతో రికార్డు సృష్టించడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా … జగన్ కు ఎప్పుడు బుద్ది చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.