Suryaa.co.in

Andhra Pradesh

లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన తాడిశెట్టి మురళి

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ లోకేశ్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. మురళి గతంలో డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. ఇటీవలే తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.

ఇవాళ లోకేశ్ సమక్షంలో తాడిశెట్టి మురళీమోహన్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

ఆ విషయంలో తగ్గేదే లే
ముస్లిం మైనార్టీ సోదరుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే పార్టీ తెలుగుదేశం అని లోకేష్ అన్నారు. సీఏఏ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు పలికిన వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశంపై చేసే దుష్ప్రచారం ఎవ్వరూ నమ్మరన్నారు. వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఇప్పుడే వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎర్ర బుక్ అంటే ప్రతీ ఒక్కరిలో వణుకు మొదలైందన్నారు. ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ 40 రోజులు అప్రమత్తంగా ఉండి ప్రతీ ఓటు కూటమికి పడేలా శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎవరిపైన ఎక్కువ అక్రమ కేసులు పెట్టిందో ఆ బాధితులకు అంత పెద్ద నామినేటడ్ పదవి ఇచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ తప్పక అమలు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకున్న పార్టీ తెలుగు దేశం పార్టీ అని, ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబునాయుడు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉపకులాల వారీగా సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదరణ పథకం కింద రూ.962 కోట్లతో నాణ్యమైన పనిముట్లు అందజేశామని, జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీలకు ప్రత్యేక హామీలు పొందుపరిచామని వాటిని అమలు చేస్తామని వెల్లడిరచారు. 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్‌, పెళ్లికానుక ద్వారా రూ.లక్ష సాయం, ఉపకులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడైన మురళి టుబాకో బోర్డు వైస్‌ చైర్మన్‌గా, టీటీడీ సలహా మండలి సభ్యుడిగా, గుంటూరు జిల్లా ధార్మిక మండలి చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

ఈ సందర్భంగా తాడిశెట్టి మురళీ మాట్లాడుతూ కూటమిని గెలిపించేందుకు అందరం కష్టపడి పనిచేస్తామని తెలిపారు. వైసీపీకి, జగన్‌కి బుద్ధి చెప్పాలంటే వారిని సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని, అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాన్నారు. వారి కుట్రలను ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ప్రతిఒక్కరం కూటమి విజయానికి కృషిచేస్తామని వెల్లడిరచారు.

మురళి ఆధ్వర్యంలో చేరిన ప్రముఖులు
పార్టీలో చేరిన ప్రముఖుల్లో మురళి సతీమణి తాడిశెట్టి అమల, మాజీ జెడ్పీటీసీ భూపతి శ్రీనివాసరావు, జయరామ్‌ నాయుడు, మల్లిబోయిన ఆవల్లి (52వ డివిజన్‌ కార్పొరేటర్‌), మాజీ కార్పొరేటర్లు అడపా కాశీవిశ్వనాథం, సంబరాల వాసు, వంజరపు రత్నకుమారి, రేఖా ఉమా మహేశ్వరి, ఇంకొల్లు శంకర్‌రావు, రెడ్డిపాలెం సర్పంచ్‌ బుజ్జి (రెడ్డిపాలెం), మాజీ సర్పంచ్‌ లు యర్రంశెట్టి వేణుగోపాల్‌, చింతా సుబ్బారావు, ఎలిమినేటి వెంకటేశ్వర్లు, మోడావత్‌ శ్రీను నాయక్‌, మాజీ ఎంపీటీసీలు మల్లెంపాటి శేషగిరిరావు, వేల్పూరి వెంకటస్వామి, వైసీపీ రాష్ట్ర నాయకులు చంగలశెట్టి సత్యనారాయణ, చింతలదేవి, సుబ్బారావు (రెడ్డిపాలెం), బీసీ నాయకు లు విన్నకోట శంకర్‌, విన్నకోట మధు, కొండబోయిన శ్రీనివాసరావు, ఎస్టీ నాయకుడు పరసా కోటేశ్వరరావు, మార్కెట్‌ యార్డు డైరక్టర్‌ తాళ్ల నాగరాజు, ప్రముఖ నాయకులు ఈదర సాయిప్రసాద్‌ చౌదరి, ఐలా శ్రీనివాసరావు (పాతగుంటూరు), మంగళగిరి చేనేత నాయకులు కానుగుల రవి, కాపు నాయకుడు నామాల శశిధర్‌, ఆర్యవైశ్య ప్రముఖులు వెచ్చా కృష్ణమూర్తి, సగర నాయకులు రెడ్డి వీరస్వామి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్‌ కోవెలమూడి నాని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్‌ అహమ్మద్‌, ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంటు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జోన్‌-3 మీడియా కో ఆర్డినేటర్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE