– డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొంతమంది గత రెండున్నరేళ్ల నుంచి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు.2022 మార్చి 6వ న మండపేట టౌన్ సిఐ దుర్గా ప్రసాద్ కాళీ కృష్ణ భగవాన్‌ను అనే యువకుడిని కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
మండపేట పట్టణానికి చెందిన కాళీ, 20 సంవత్సరాల వయస్సు యువకుడు. తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ నివసిస్తున్నాడు.“మా అమ్మాయితో కాళి మాట్లాడుతున్నాడని” ఓ అమ్మాయి తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు ఆదివారం టౌన్ సీఐ దుర్గాప్రసాద్ కాళిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
విచారణ పేరుతో కాళీని దారుణంగా చిత్రహింసలకు గురి చేసి రాత్రి 8.30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి వదిలేశారు.కాళీ మర్మాంగాలపై కూడా తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లారు.8 మార్చి 2022 (మంగళవారం) కాళీ కృష్ణ మృతదేహం ఎడిడా రోడ్డులో కనుగొనబడింది.
కాళీ మర్మాంగాలకు తగిలిన దెబ్బలతో నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
సీఐ దుర్గాప్రసాద్ వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమని బాధితుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు చెబుతున్నారు. సీఐ దుర్గాప్రసాద్ అవినీతిపరుడని, ప్రస్తుత కేసులో సైతం లంచం తీసుకున్నాడని పలు ఆరోపణలు వచ్చాయి.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, చిత్రహింసలకు గురి చేయడం, వ్యక్తిగత భాగాలకు తీవ్ర గాయాలు చేసినందుకు సిఐ దుర్గాప్రసాద్‌పై తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాను.మీరు తీసుకునే సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో పోలీసుల