– ఆయనతో కుమ్మక్కైన ఈఆర్ఓలపై కఠిన చర్యలు తీసుకోండి
– ఈసీకి టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదు
• సజ్జల కుటుంబ డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి.
• రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు చేర్చుతూ..ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంలో ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేశాం.
• అయినా, కొంతమంది డీఈఓలు, ఈఆర్ఓలు లెక్కచేయకుండా అధికారపార్టీతో కుమ్మక్కై వారి డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించలేదు.
• సి.ఎం జగన్ రెడ్డికి సజ్జలు అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు. సజ్జల క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఉన్నారు.
• సజ్జల కుటుంబానికి రెండు ఓట్లు ఉండటం ఓటర్ లిస్టులోని అవకతవకలకు ఒక క్లాసిక్ ఉదాహరణ.
• సజ్జల కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు రెండు నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నాయి.
• వాటికి సంబంధించిన ఆధారాలను లేఖతో జతచేస్తున్నాం.
• చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారంపై ఒక ప్రత్యేక విచారణ చేయించండి.
• రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సెక్షన్ – 31 ప్రకారం సజ్జల కుటుంబంపై తగు చర్యలు తీసుకోండి.
• సజ్జల కుటుంబం డబుల్ ఓట్లు తొలగించకుండా.. ఆయనతో కుమ్మక్కైన ఈఆర్ఓలపై కఠిన చర్యలు తీసుకోండి.