Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఉంచేలా చర్యల తీసుకోండి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు. ప్రభుత్వం జిఓలను రహస్యంగా ఉంచిన తరహాలోనే ఎఫ్‌ఐఆర్‌లను కూడా దాచిపెడుతోంది.వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి రహస్య GOలతో అపఖ్యాతి పాలైనా బుద్ది రాలేదు.ఫాసిస్టు పాలనకు కొనసాగింపుగా ఎఫ్‌ఐఆర్‌ల విషయంలోనూ ప్రభుత్వం అదే పద్ధతిని అనుసరిస్తోంది.

సెక్షన్ 154, 207 CrPC ప్రకారం నిందితులకు ఎఫ్.ఐ.ఆర్ మరియు సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచాలని స్పష్టంగా నిర్దేశిస్తోంది.నిందితులకు న్యాయమైన విచారణకు అవకాశం కల్పించడం సహజ న్యాయ సూత్రాలలో భాగం.ఇదే విషయాన్ని గౌరవ సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా చెప్పింది.సెక్షన్ 207 CrPC కింద నిందితుడు ప్రథమ సమాచార నివేదిక కాపీని పొందడానికి అర్హుడు.

రిట్ పిటీషన్ నం. 68/2016 కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం పోలీసులు నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌ లు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అత్యంత సున్నితమైన స్వభావం కలిగి ఉంటే తప్ప అన్ని ఎఫ్.ఐ.ఆర్ లను 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి.అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట ఆదేశాలకు, సూచనలకు కట్టుబడి ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా గౌరవ సుప్రీంకోర్టు పేర్కొంది.

టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడుపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఎఫ్‌ఐఆర్‌ను పోలీసుల పబ్లిక్ డొమైన్ లో ఉంచడం లేదు.41ఎ సిఆర్‌పిసి కింద నోటీసులు అందజేసేందుకు ప్రతిరోజూ నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడు ఇంటికి పోలీసులు వస్తూనే ఉన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించి ఉంటే అయ్యన్న పాత్రుడు న్యాయవ్యవస్థను ఆశ్రయించే సౌలభ్యం ఉండేది.అపెక్స్ కోర్టు సూచనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్న పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారానికి సమానం. కాబట్టి సెక్షన్ 154 & 207 CrPCలో పేర్కొన్న విధంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాఫీలను కేసు నమోదు చేసిన 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచేలా పోలీసు శాఖను ఆదేశించండి.

LEAVE A RESPONSE