పెదకాకానిలో తెదేపా నేత దూళిపాళ్ల నరేంద్రపై మట్టిమాఫియా చేసిన దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
• రాష్ట్రంలో మట్టి మాఫియా విచక్షణారహితంగా చెరువులను తవ్వేస్తున్నారు.
• తెదేపా నేతలు పిర్యాదు చేస్తున్నప్పటికీ అక్రమ త్రవ్వకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• కొంతమంది అధికారులు పోలీసులతో కుమ్మక్కై వైసీపీ నేతల అండదండలతో మట్టి మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
• గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడి గ్రామంలోని తాగునీటి చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టిపెట్టండి.
• అనుమర్లపూడి చెరవులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు టిడిపి సీనియర్ నాయకులు ధూళిపాళ నరేంద్ర 13 జూన్ 2022న సందర్శించారు.
• మట్టి మాఫియా, అధికార వైసీపీ గూండాలు నరేంద్రపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు.
• మట్టి మాఫియాతో కలిసి వైసీపీ గూండాలు నరేంద్రపై పట్టపగలే దాడి చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• అక్రమ మట్టి త్రవ్వకాలకు నిరసనగా నరేంద్ర 2022 జూన్ 20న అనుమర్లపూడి చెరువు వద్ద శాంతియుతంగా సమావేశమయ్యేందుకు పిలుపునిచ్చారు.
• ఆసక్తికరంగా నరేంద్ర చేపట్టిన శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు దాదాపు 450 మంది పోలీసులను మోహరించారు.
• నరేంద్ర అనుమర్లపూడి వేదిక వద్దకు చేరుకోగా పోలీసులు లాఠీచార్జ్ చేసి నరేంద్రను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
• ఆర్టికల్ 19(1)(బి) ప్రకారం ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు రాజ్యాంగం కల్పించింది.
• నరేంద్ర విషయంలో ఆర్టికల్ ఆర్టికల్ 19(1)(ఎ) లో ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రంను, భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు తీవ్రంగా ఉల్లంఘించారు.
• పోలీసుల తీరుతో మట్టి మాఫియా, వైసిపి నాయకులు, పోలీసుల మధ్య ఉన్న బంధాన్ని బహిరంగపర్చింది.
• భావితరాల కోసం సహజ వనరులను కాపాడుకోవాలి.
• ప్రాథమిక హక్కులు కాపాడటంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.
• దీనిపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
• భవిష్యత్తులో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోండి.