Suryaa.co.in

Telangana

కేటీఆర్ ఎంపీలు వద్దిరాజు, సురేష్ రెడ్డిను సన్మానించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ సుంకర (శంభీపూర్)రాజు తదితర ప్రముఖులను శాలువాలతో సత్కరించారు.

ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యాన చెన్నైలో “జేఏసీ ఫర్ ఫేర్ డీలిమిటేషన్”పేరుతో శనివారం సమావేశం జరిగింది.నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అఖిల పక్ష సమావేశం ఏర్పాటైంది.ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన సందర్భంగా స్టాలిన్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి,మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రాజు తదితర ప్రముఖులను శాలువాలతో సత్కరించి,జ్ఞాపికలను బహుకరించారు.

ఈ సందర్భంగా స్టాలిన్ వెంట ఆయన కుమారుడు,ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీలు దయానిధి మారన్,కనిమొళి తదితర ప్రముఖులు ఉన్నారు

LEAVE A RESPONSE