* తక్కువ అప్పుల్లో సిక్కిం
* ఏపీ అప్పు3,98,903 లక్షల కోట్లు
* తెలంగాణ అప్పు 3,12,191 లక్షల కోట్లు
* లెక్కలు గుట్టు విప్పిన కేంద్రం
మార్తి సుబ్రహ్మణ్యం
రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్ష పాటించకుండా, ఇష్టానుసారం అప్పులు చేసి ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో.. ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసిందో తేలిపోయింది. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంటులో బయటపెట్టింది. ఎంపీ కిశోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ జాబితాను వెల్లడించారు. ఆ ప్రకారంగా.. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు నె ంబర్‌వన్ స్థానంలో ఉండగా, అతి తక్కువ అప్పు చేసిన రాష్ట్రంగా సిక్కిం నమోదయింది. కాగా ఆంధ్రపదేశ్ 3,98,903 లక్షల కోట్లతో 8వ స్థానం, తెలంగాణ 3,12,191 లక్షల కోట్లతో 11వ స్థానంలో ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు
1.తమినాడు- 6,59,868 లక్షల కోట్లు
2. ఉత్తరప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు
3. మహారాష్ట్ర – 6,08,999 లక్షల కోట్లు
4. వెస్ట్ బెంగాల్- 5,62,697 లక్షల కోట్లు
5. రాజస్థాన్ – 4,77,177 లక్షల కోట్లు
6. కర్నాటక – 4,62,832 లక్షల కోట్లు
7. గుజరాత్ – 4,02,785 లక్షల కోట్లు
8. ఆంధ్రప్రదేశ్ – 3,98,903 లక్షల కోట్లు
9. కేరళ – 3,35,989 లక్షల కోట్లు
10. మధ్యప్రదేశ్ – 3,17,736 లక్షల కోట్లు
11. తెలంగాణ – 3,12,191 లక్షల కోట్లు
12. పంజాబ్ – 2,82,864 లక్షల కోట్లు
13. హర్యానా – 2,79,022 లక్షల కోట్లు
14. బీహార్ – 2,46,413 లక్షల కోట్లు
15. ఒడిశా- 1,67,205 లక్షల కోట్లు
16. జార్ఖండ్ -1,17,789 లక్షల కోట్లు
17. చత్తీస్‌ఘడ్ -1,14,200 లక్షల కోట్లు
18. అస్సాం -1,07,719 లక్షల కోట్లు
19. ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు
20. హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు
21. గోవా- 28,509 వేలకోట్లు
22. త్రిపుర -23,624 వేల కోట్లు
23. మేఘాలయ- 15,125 వేల కోట్లు
24. నాగాలాండ్- 15,125 వేల కోట్లు
25. అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు
26. మణిపూర్ -13,510 వేలకోట్లు
27. మిజోరాం- 11,830 వేల కోట్లు
28. సిక్కిం -11,285 వేల కోట్లు