Suryaa.co.in

Andhra Pradesh National

తమిళ యూట్యూబర్ అరెస్టు

సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు వీవీవాసన్

తిరుమల : శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూ బర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు.

వీడియోలు ఇటీవల సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. ఆలయ గౌరవానికి భంగం కలిగిం చడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటివాటిపై తితిదే ఐటీలోని సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్ట్ చేశారు.

వారిని తిరుమలకు తీసుకువచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మరిన్ని సెక్షన్లు జోడించి నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

LEAVE A RESPONSE