Suryaa.co.in

Andhra Pradesh

బాబు ఇకనైనా అనైతిక రాజకీయాలు విడిచిపెట్టాలి

-బాలికపై అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దు
-ఆ అమ్మాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది
-ఇప్పటికే రూ.10 లక్షలు ఇచ్చాం. ఇల్లు కూడా మంజూరు
-అమ్మాయి లేదా ఆమె తల్లికి తగిన ఉద్యోగం కూడా ఇస్తాం
-నిందితులను మూడు గంటల్లోనే అరెస్టు చేశాం
-వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం
-రాష్ట్రంలో మహిళలంతా జగన్‌గారి వెంటే ఉన్నారు
-సర్వేలో ఈ విషయం తేటతెల్లం అయింది
-అందుకే ప్రతి ఘటనను రాజకీయం చేస్తున్నారు
-ఈ ప్రభుత్వ పాలనలో మహిళలు సురక్షితం
-దిశ యాప్‌ ద్వారా ఇప్పటికే దాదాపు 900 మందికి రక్షణ
-రాజమండ్రి, ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌ ప్రెస్‌మీట్‌

రాజమండ్రి: ప్రెస్‌మీట్‌లో హోం మంత్రి తానేటి వనిత ఏం మాట్లాడారంటే..:
ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం:
విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన అమ్మాయికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటోంది. సీఎంగారి ఆదేశం మేరకు రూ.10 లక్షలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అంతే కాకుండా ఆ అమ్మాయి ఏ ఉద్యోగం చేసినా అవకాశం ఇస్తాం. ఒకవేళ ఆ అమ్మాయి ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోతే, ఆమె తల్లికి ఉద్యోగం ఇస్తాం. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ను ఆదేశించాం. ఘటన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మూడు గంటల్లోనే నిందితులను పట్టుకోవడం జరిగింది. వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం.

టీడీపీ అనైతిక రాజకీయం:
అయితే ఆ అమ్మాయి పరామర్శ పేరుతో విపక్షపనేత చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందీ మార్భలంతో వెళ్లిన చంద్రబాబు, అక్కడ అనైతికంగా ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదు. అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా చంద్రబాబు రాజకీయం చేశారు.

ట్రోల్‌ చేయడం మహిళలకు గౌరవమా?:
ఆరోజు నేను హోం మంత్రిగా అక్కడికి వెళ్లి, ఆమెకు పరిహారం ఇచ్చి, మీడియాతో మాట్లాడితే, నన్ను దారుణంగా ట్రోల్‌ చేశారు. ఇదేనా టీడీపీ మహిళలకు ఇచ్చే గౌరవం? నేను చెమటను తూడ్చుకుంటే, దాన్నీ దారుణంగా చూపారు. నన్ను ట్రోల్‌ చేయడం మహిళలకు ఇచ్చే గౌరవమా..?

మహిళలకు రక్షణగా దిశ యాప్‌:
సీఎం వైయస్‌ మహిళల భద్రత కోసం దిశ చట్టం రూపొందించడంతో పాటు, ప్రత్యేకంగా దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాదా దిశ చట్టానికి కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు. అయితే దిశ యాప్‌ ఇప్పటికే దాదాపు 900 మంది మహిళలు, యువతులకు రక్షణగా నిల్చింది.

కుళాయి దగ్గర కొట్లాటలా..:
అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించడానికి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వెళ్తే, విపక్షానికి చెందిన మహిళా నాయకులు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఎలా విమర్శించారు. అన్నది అందరూ చూశారు. మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ తో టీడీపీ మహిళలు కుళాయి దగ్గర కొట్లాటలా వ్యవహరించారు. మానసిక వికలాంగురాలైన బాలిక సమక్షంలో ఆస్పత్రిలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌పై దాడి చేశారు. ఇదేనా మహిళలపై విపక్షానికి ఉన్న గౌరవం?.

టీడీపీ హయాంలో..:
గతంలో టీడీపీ పాలనలో ఎమ్మార్వో వనజాక్షిని అధికార పార్టీ ఎమ్మెల్యే జుట్టుపట్టి లాగి కొట్టినా, ఏ చర్యా లేదు. అలాగే అప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాదరావు, అప్పటి ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ.. కారు షెడ్డులో ఉండాలి. మహిళ ఇంట్లో ఉండాలని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కూడా విజయవాడలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. ఆ కుటుంబాన్ని టీడీపీ నేత బోండా ఉమా మళ్లీ బయటకు తీసుకొచ్చారు. దాని ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు.

సర్వేలు తేల్చాయి. అందుకే రచ్చ:
ఇవాళ మహిళలంతా పెద్ద ఎత్తున సీఎం వైయస్‌ జగన్‌ పక్షాన నిల్చారు. వారి పాలనపై ఎంతో విశ్వాసంతో ఉన్నారు. అందుకే టీడీపీ వారు నిరాశ, నిస్పృహలతో మాట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే తమకు మేలు జరుగుతుంది. తమకు భద్రత ఉంటుంది. తాము అభివృద్ధి చెందుతాము అన్న దానిపై మహిళలకు స్పష్టత ఉంది. వారంతా జగన్‌ వెంటే ఉన్నారు. మహిళలంతా సీఎం జగన్‌ వెనక ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. సర్వేల ప్రకారమే ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయి.
ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
అందుకే ఎక్కడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు.
మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు తప్ప, ఆ కుటుంబానికి మేలు జరగాలని కోరుకోవడం లేదు. మేము మరోసారి చెబుతున్నాం. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటాం. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించబోము.

పద్ధతి మార్చుకోండి:
రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనను రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ చేసే విష ప్రచారాలను గమనిస్తూనే వున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఆ ఘటనను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం మానాలి.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
గతంలో ఇంత కంటే ఎక్కువగా..:
గత ప్రభుత్వ హయాంలోనూ మహిళలపై చాలా అత్యాచారాలు జరిగాయి. కానీ అవన్నీ బయటకు రాలేదు. ఎందుకంటే చాలా చోట్ల బాధితులు బయటకు రాలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక, సైబర్‌మిత్ర యాప్, దిశ యాప్‌ను ప్రవేశపెట్టి, మహిళలు, యువతకు రక్షణ కల్పిస్తున్నాం. దిశ యాప్‌ ద్వారా చాలా మంది మహిళలు, యువతులు రక్షణ పొందారు. మా ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారు.
రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్‌ పాలనపై పూర్తి నమ్మకంతో వున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే టీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు.

LEAVE A RESPONSE